కొబ్బరినూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాము.ఇక కొబ్బరి నూనెలో కర్పూరం కలపడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. కొబ్బరినూనె వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికీ, చర్మానికీ చాలా మేలు చేస్తుంది. ఇంక కర్పూరం మనం చాలా రకాలుగా వాడుతాం. ఈ రెండింటినీ కలిపి వాడితే చాలా రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

అయితే చర్మ అలెర్జీలను వదిలించుకోండానికి ఇలా ట్రై చేయండి. మీకు చర్మంపై అలెర్జీ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే కొబ్బరి నూనెతో కర్పూరం కలిపి అలెర్జీ ఉన్న ప్రదేశంలో రాసుకోండి. ఇలా రెండు మూడు రోజులు చేశారంటే.. ఇక మీకు ఆ సమస్య తొలగిపోయినట్లే. మొటిమలను ఇలా తొలగించవచ్చు అని నిపుణులు తెలిపారు. చర్మంపై మొటిమలు మీ ముఖాన్ని పాడు చేస్తాయి. కొబ్బరి నూనె, కర్పూరం కలిపిన తైలాన్ని మొటిమలపై రాస్తే, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని చూడొచ్చు.  కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. గోరువెచ్చని నూనె కర్పూరం కలిపి... గోరుపై పూస్తే కొంతకాలం మసాజ్ చేస్తే, అప్పుడు ఫంగస్ క్రమంగా తగ్గుతుంది.

ఇక కర్పూరం, కొబ్బరి నుంచి తయారైన నూనె కలిపి పెట్టడం వలన చుండ్రు సమస్యను పరిష్కరించడానికి గొప్ప ఉపశమనంగా ఉంటుంది. అంతేకాదు మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన పదార్థాల్ని చేర్చడంతో పాటు, కర్పూరంతో కూడిన కొబ్బరి నూనెతో జుట్టుకి రెగ్యులర్ ‌గా హెడ్ మసాజ్ చేయండి. ఇక ముఖంపై మచ్చలు ఎక్కువగా ఉంటే, రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెలో కర్పూరం పొడి వేసి.. మచ్చలపై మసాజ్ చేయండి. దీనివల్ల మచ్చలు నెమ్మదిగా క్లియర్ అవుతాయని నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: