కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నానిపై ఓ తాపీ మేస్త్రీ హత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని నివాసంలో వద్ద ఓ తాపీ మేస్త్రీ మంత్రి కాళ్ళకు దండం పెడుతూ తన వెంట తెచ్చుకున్న తాపీతో పేర్ని నానిపై ఒక్కసారిగా దాడి చేశారు. వెంటనే నిందితున్ని మంత్రి అనుచరులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తాపీ మేస్త్రీ మద్యం మత్తులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇసుక లేక పనుల్లేక ఇబ్బంది పడుతుంటే మంత్రి ఏం చేస్తున్నారంటూ దాడికి యత్నించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు విశాఖ సీతమ్మదారలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని భవన నిర్మాణ కార్మికులు చుట్టుముట్టారు. ఇవన్నీ చూస్తుంటే మంత్రులకు ఇసుక సెగ తగులుతున్నట్టుగా పలువురు భావిస్తున్నారు.


అదృష్టవశాత్తూ ఏం కాలేదు: మంత్రి


ఇంట్లో తన తల్లి దశదిన కర్మ జరుగుతుండగ ఓ వ్యక్తి తన కళ్లపై పడుతున్నట్టు ముందుకు వచ్చి పదునైన ఆయుధంతో దాడి చేసేందుకు యత్నించాడని పేర్ని నాని తెలిపారు. ఒక్కసారి తనని పొడిచే ప్రయత్నం చేసినా అదృష్టవశాత్తు తనకు తగల్లేదని, రెండోసారి పొడిచే ప్రయత్నం చేస్తుండగా గన్‍మెన్లు పట్టుకున్నారని తెలిపారు



మరింత సమాచారం తెలుసుకోండి: