జీహెచ్ఎంసీ ఎల‌క్ష‌న్స్ లో పోలింగ్ చాలా మంద‌కొడిగా జ‌రుగుతోంది. ఉద‌యం 7.00 గంట‌ల‌కు మొద‌లైన పోలింగ్ లో చాలా త‌క్కువ మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 11 శాత‌ము మాత్ర‌మే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగే జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో, ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తూ చాలా త‌క్కువ మందే పాల్గోనే అవ‌కాశం క‌నిపిస్తోంది.


జీహెచ్ఎంసీ ఎల‌క్ష‌న్స్ జ‌రుగుతున్న కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెల‌కోన్నాయి. అధికార టీఆర్ఎస్, ప్ర‌తిప‌క్ష బీజేపీ,కాంగ్రెస్ లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌రస్ప‌ర ఘ‌ర్ష‌ణ‌లకు దిగుతున్నాయి. . కేపీహెచ్‌బీ కాలనీలోని పోలింగ్‌ కేంద్రం 58 వద్ద, బంజారాహిల్స్‌ ఎన్జీనగర్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇలాంటి పరిస్థితి నెల‌కోంది.


ఇదిలాఉంటే జీహెచ్ఎంసీ ఎల‌క్ష‌న్స్ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పేర్కోంది. అనివార్య‌ల ప‌రిస్థితుల వ‌ల్ల , కొన్ని చోట్ల రీ-పోలింగ్ నిర్వహించాల్సి ఉన్నందున ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 3 సాయంత్రం వ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించ‌కూడ‌దని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఈ మేర‌కు తెలిపింది. 

#ghmc #trs #bjp #congress 

మరింత సమాచారం తెలుసుకోండి: