దేశీయ ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో అత్యధిక కస్టమర్లను కలిగివున్న ప్రభుత్వరంగ బ్యాంకు గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను అందిస్తుంది. అంతేకాకుండా తమ కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా వివిధ రకాల స్కీం లను కూడా అందుబాటులోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే తమ కస్టమర్ల కోసం ఎస్బిఐ కు చెందిన అనుబంధ సంస్థ ఎస్బిఐ కార్డు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది.




 సరి కొత్త స్కీమ్ ప్రస్తుతం అందించేందుకు సిద్ధమయ్యింది. ఇక ఇటీవలే ఎస్బిఐ కార్డు తీసుకొచ్చిన ఈ స్కీం ద్వారా ఎంతో సులభంగా కస్టమర్లు డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎస్బిఐ కార్డు  రెఫర్ అండ్ ప్రోగ్రామ్ అందిస్తుంది... ఇక ఈ స్కీం కింద అమెజాన్లో వోచర్లు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ప్రతి ఏడాది దాదాపు 25 వేలకు పైగా వోచర్లను  సొంతం చేసుకునేందుకు ప్రస్తుతం ప్రతి కస్టమర్కు అవకాశం ఉంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు మీ స్నేహితులు లేదంటే  కుటుంబ సభ్యులను క్రెడిట్ కార్డు తీసుకునేలా చేస్తే సరిపోతుంది.


 దీనికోసం ముందుగా మీరు ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇతరులను రిఫర్ చేయడం ద్వారా మీరు పాయింట్లు పొందుతూ ఉంటారు. మీరు ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు తీసుకోవడం ద్వారా మీకు 500 పాయింట్లు వస్తాయి.  మీ రెఫరల్ కోడ్ ద్వారా ఎంతమంది ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు తీసుకుంటే అన్ని 500 వోచర్లు మీకు గరిష్టంగా లభిస్తాయి. ఇలా గరిష్ఠంగా ఏడాదిలో వోచర్ల  ద్వారా 25000 పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇక 60 రోజుల్లో మీ వోచర్ కు సంబంధించిన అమౌంట్ క్రెడిట్ కార్డు అకౌంట్ కు వచ్చి చేరుతుంది.  ఇలాంటి అద్భుతమైన ఆఫర్ను ప్రస్తుతం తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది ఎస్బిఐ కార్డు.

మరింత సమాచారం తెలుసుకోండి: