కరోనా ఎక్కువవుతుంది ఒకప్పుడు ఎన్నికలు వద్దన్నా నిమ్మగడ్డ ఇప్పుడు అదే కరోనా ఇంకా తగ్గలేదు ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు.. దీనికి వైసీపీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు.. అయన చెప్పోనట్లు వినడానికి మేమేం నిమ్మగడ్డ ఎంచుకున్న ప్రభుత్వం కాదు ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం అనిఅంటున్నారు.. ఒకవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలా అర్థం లేకుండా నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించడం పై రాజకీయ నాయకులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న బీహార్ లో తిరిగి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు హైదరాబాద్ లో ఓటర్లు వచ్చి ఓటు వేయలేని పరిస్థితి ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని వైసీపీ వాదన..
అయితే రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని తెలియజేస్తూ ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు లేఖ కూడా రాశారు. పట్టించుకోని నిమ్మగడ్డ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయిన ఎస్ఈసీకి ప్రభుత్వ వైపు నుంచి సహకారం ఉండటం లేదని ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. ఏదేమైనా నిమ్మగడ్డ ఎవరు చెప్పినా వినే స్థితిలో లేరని తెలుస్తుంది.. అసలు ఏం ఆశించి ఈయన ప్రభుత్వం తో వివాదాన్ని రాజేసుకుంటున్నారో అర్థం కావట్లేదు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి