ఆంధ్రప్రదేశ్ లోకి కొత్త చాక్లెట్లు వచ్చాయి. అవి తింటే తియ్యగా మాత్రం ఉండవ్.. మత్తుగా ఆపై గమ్మత్తుగా ఉంటాయి. కోల్ కతా, ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నంకు ఈ మత్తు చాక్లెట్లు యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. ప్రభుత్వం నిషేధం విధించిన గుట్కా, జర్దా, పాన్ మసాలతో పాటు భంగ్ పేరుతో మత్తు చాక్లెట్లను అక్రమార్కులు రవాణా చేస్తున్నారు. ఈ విషయం పై పూర్తి సమాచారం అందుకున్న విశాఖ పోలీసులు ఆ స్థావరాల పై దాడులు చేశారు. ఈ మేరకు వారి వద్ద నుంచి భారీ మొత్తంలో భంగ్ చాక్లెట్స్ మరియు నిషేధించిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు...
భంగ్ ను ఎక్కువగా ఉత్తరాధి రాష్ట్రాల్లో మత్తుకోసం వినియోగిస్తారు. గుళికల రూపంలో వీటిని విక్రయిస్తారు. కొందరు దీనిని నేరుగా తీసుకుంటే మరికొందరు నీటిలో కలుపుకోని సేవిస్తారు. భంగ్ తీసుకున్నవారు కొన్ని గంటల పాటు మైకంలో ఉంటారు. డ్రగ్స్ మాదిరిగానే ఇది పనిచేస్తుంది. ఉత్తరాధి రాష్ట్రాల్లో దీని వినియోగం బహిరంగమే అయినా ఏపీలో మాత్రం దీనిపై నిషేధం ఉంది. దీంతో మత్తు పదార్థాలను సరఫరా చేసే ముఠా ఇక్కడకు రవాణా చేసి అమ్ముతున్నారు.స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయిపై ఉక్కుపాదం మోపడం, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటండంతో ఈజీగా రవాణా అయ్యే భంగ్ ను అక్రమార్కులు విశాఖ తీసుకొస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ విషయం పై మరింత సమాచారాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి