ప్రస్తుతం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ఆర్మీ  రోజు రోజుకు మరింత పటిష్టవంతంగా మారుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత ఆర్మీ కి ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శత్రువులు దాడి చేసినప్పుడు పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూడకుండా కిందిస్థాయి అధికారులు సత్వరమే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం కల్పించింది. అదేసమయంలో ప్రస్తుతం పాకిస్తాన్ చైనా దేశాలతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ క్షణంలో యుద్ధం తలెత్తిన... ఎదుర్కొని దీటుగా బదులిచ్చి యుద్ధంలో విజయం సాధించే విధంగా భారత ఆర్మీ ని సిద్ధం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.



 ఈ క్రమంలోనే భారత ఆర్మీలో ఎంతో వినూత్నమైన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను చేర్చడానికి భారత ఆర్మీ కి ఎక్కువ మొత్తంలో ప్రస్తుతం బడ్జెట్ కూడా కేటాయిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశి ఆయుధాల కొనుగోలుతో పాటు స్వదేశీ ఆయుధాలను కూడా భారత ఆర్మీలో చేరుస్తూ మరింత పటిష్టవంతం చేస్తుంది. ఇటీవలె త్రివిధ దళాలకు ఏ క్షణంలో యుద్ధం  తలెత్తినా ఎదుర్కొనేందుకు కావలసిన అన్ని రకాల ఆయుధాల గురించి కేంద్రానికి తెలపాలి అంటూ కేంద్రం కోరింది. ఈ క్రమంలోనే నేవి కేంద్రం ముందు ఒక ప్రతిపాదన ఉంచింది.



 ఇటీవలే భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మోస్  మిసైల్స్  తయారు చేసింది అనే విషయం తెలిసిందే. దాదాపు 450 కిలోమీటర్ల దూరం లో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఎంతో సమర్థవంతంగా చేదించేటువంటి బ్రహ్మోస్  మిస్సయిల్  ని ప్రస్తుతం ప్రతి యుద్ధనౌక లో 38 బ్రహ్మోస్  మిసైల్స్ నూ అమర్చే విధంగా నేవి కి  నిధులు కేటాయించాలి అంటూ నేవి ఇటీవలే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది దీనికి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీనికిగాను 1800 కోట్ల రూపాయలునిధులు అవసరమైనప్పటికీ  కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: