ఎప్పటి నుంచో పొలిటికల్ ఎంట్రీ ఇస్తానంటూ ఊరిస్తూ వచ్చిన తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ నెల 31వ తేదీన.. జనవరి లో తాను స్థాపించబోయే పార్టీ పేరు ప్రకటిస్తారని జనాలంతా ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో, సినిమా షూటింగ్ లో ఆయన అస్వస్థతకు గురై హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని చెన్నై లోని తన నివాసానికి చేరుకున్న తరువాత స్థానిక రాజకీయాలకు పులిస్టాప్ పెట్టేస్తున్నాను అని, కొత్త పార్టీ స్థాపించడం లేదని, అభిమానులు అందరూ క్షమించాలి అంటూ మూడు పేజీల లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇంత అకస్మాత్తుగా రజిని యూటర్న్ తీసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. రజినీకాంత్ సొంతంగా చేయించుకున్న సర్వేలు దారుణమైన ఫలితాలను ఇచ్చాయట. అలా అని బిజెపికి మద్దతుగా నిలబడదాము అంటే అభిమానులు ససేమిరా అనేస్తున్నారు. 
వంద రోజుల్లో రాష్ట్రమంతటా పర్యటించి బలం పెంచుకుందాము అంటే, ఆరోగ్యం సహకరించక పోవడం , నిధులు కొరత వంటి కారణాలతో రజిని వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ వివిధ సంస్థల ద్వారా సమగ్రంగా చేయించుకున్న సర్వేలో 234 స్థానాల్లో పోటీ చేసినా, కేవలం పది పదిహేను స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపించగలిగెలా ఉంద 12 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని స్వయంగా రజినీకాంత్ సైతం గెలుపు దక్కడం కష్టమైన ఉన్నట్లుగా వార్తలు రావడంతో ఆయన అనారోగ్యం కారణం చూపించి రాజకీయాలకు రాం రాం అంటూ ప్రకటించేశారు. వయసు బలం ఉన్న సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రాకుండా, వయసు అయిపోయిన తర్వాత అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టిన తర్వాత రాజకీయాల్లోకి రావడం తమిళ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.
అలాగే గతేడాది పెరియార్ కు వ్యతిరేకంగా రజిని చేసిన వ్యాఖ్యలు సైతం ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని పెంచాయి.కాస్త వివాదాస్పదమైన విమర్శలు పాలైన రజిని పొలిటికల్ ఎంట్రీ పూర్తిగా వాయిదా వేసుకోవడం ద్వారా తన పరువు దిగజారకుండా కాపాడుకోగలిగినట్టే.
ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి: