కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎంపిక పెద్ద ప్రహసనంలా మారింది. చాలా కాలంగా కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నా, ఈ పదవి కోసం పోటీ పడే సీనియర్ నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో , రకరకాల మార్గాలను అన్వేషించి అందరి అభిప్రాయాలను సేకరించి, చివరకు కాంగ్రెస్ సీనియర్ల బెదిరింపులకు సైతం లొంగి రేవంత్ రెడ్డికి కాకుండా జీవన్ రెడ్డి కి ఈ పదవి కట్టబెట్టేందుకు, రేవంత్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయిపోయింది. దీనిపై ప్రకటన కూడా వస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణంలో, తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి సంచలనం సృష్టించారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని ,కాంగ్రెస్ అధిష్టానానికి సూచించారు. ఈ మేరకు ఏఐసిసి
తెలంగాణ ఇన్చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్
రాజ్ కు
జానారెడ్డి ఫోన్ చేశారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక లో గందరగోళం కారణంగా ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై పడుతుందని , ఉప ఎన్నికల ముందు కొత్త అధ్యక్షుడు ప్రకటించడం కారణంగా నాయకుల్లో ఐక్యమత్యం దెబ్బ తింటుందని
జానా రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాల నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు వరకు
కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ అందరి అభిప్రాయాలు సేకరించారు.
చివరకు
జీవన్ రెడ్డి కు కన్ఫామ్ అయిందని అంతా భావిస్తున్న తరుణంలో
జానారెడ్డి సూచనతో
కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా పిసిసి అధ్యక్షుడి ఎంపిక కు తరచుగా ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉంది.