మారుతున్న జీవన శైలి, శరీరానికి వ్యాయామం లేకపోవడంతో ప్రస్తుతం చాలా మంది ఊబకాయులు కనిపిస్తుండటం చూస్తూనే ఉంటాం. సరైన నిద్ర, తిండి లేకపోవడం మరో కారణం కూడా కావొచ్చు. ప్రతి పది మంది నలుగురు ఊబకాయ సమస్యతో బాధ పడుతూ ఉంటారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో కూడా శరీరంలో మార్పులు వచ్చి ఊబకాయులుగా తయారవుతారు. ఎన్ని వ్యాయామాలు చేసినా.. టైంకి తినడం.. టైంకి పడుకోవడం చేయకపోతే జీవన చక్రంలో మార్పులు వచ్చి శరీరం బరువు పెరుగుతుంది.

బరువు తగ్గడానికి కేవలం వ్యాయామం చేయడం ఒక్కటే సరిపోదు. దానికి తగిన ఆహారాన్ని కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్‌, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఆకలి అనిపించినప్పుడు తీసుకోవాల్సిన స్నాక్స్‌ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రోజుకి 5 బాదంలను తినడం వల్ల డే మొత్తం ఎంతో ఎనర్జీని అందజేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. బాదం తినడం వల్ల ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చేస్తుందని వారు పేర్కొన్నారు. రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటు, కొలస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

బ్లూ బ్రెరీ, బ్లాక్‌ బెర్రీ, స్టా బెర్రీ వంటి మిక్డ్స్‌ బెర్రీలను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించేందుకు దోహదపడుతాయి. కార్బోహైడ్రేట్స్‌ వల్ల ఇన్‌స్టేంట్‌ ఎనర్జీ దొరుకుతుంది. సెలరీ కర్రలుగా పిలిచే ఈ కాండలలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటితో జ్యూస్‌ కూడా చేసుకోవచ్చు. ఫైబర్‌ వల్ల ఎముకలు స్టాంగ్‌ అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తోంది.

డార్క్‌ చాక్లెట్‌ ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫేవనోల్స్‌ తినే కోరికను చంపుతుంది. చాక్లెట్‌ను తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా దరి చేరవు. కడుపు నిండుగా అనిపించడంతో బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఎండిన కొబ్బరి, ద్రాక్ష, క్యారెట్లు, పాప్‌కార్న్‌లను స్నాక్స్‌ రూపంలో తీసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉండటం వల్ల శరీర బరువును సమతుల్యంలో ఉంచేందుకు దోహదపడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: