ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం లో రక్షణ పరంగా భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకం గా అడుగులు వేసింది  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధార పడిన భారత్ కి ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తుంది. మేకిన్ ఇండియా లో భాగంగా శర వేగంగా ఆయుధాల ను అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుతం భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డి ఆర్ డి ఓ శరవేగంగా క్షిపణుల ను అభివృద్ధి చేస్తూ ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్న విషయం తెలిసిందే.



 ఇప్పటి వరకు ఎక్కడా కనీవినీ ఎరుగని టెక్నాలజీ తో కూడిన మిసైల్స్ అభివృద్ధి చేసి శరవేగంగా ప్రయోగాలు నిర్వహిస్తూ విజయ వంతం అవుతుంది భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ. అదే సమయంలో ఆయుధ వ్యాపారాన్ని ప్రారంభించి క్రమ క్రమంగా ఆయుధ  వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమం లోనే మేకిన్ ఇండియా లో భాగంగా విదేశీ సంస్థలను ఆహ్వానిస్తుంది.  ఇక ప్రస్తుతం ఒక విదేశీ సంస్థ భారత్లో ఆయుధాల తయారీకి ముందుకు వచ్చింది.



 బ్రిటన్ కు సంబంధించినటు వంటి ధాలే  ఎయిర్ డిఫెన్స్ సంస్థ భారత్ లో ఆయుధాలు తయారు చేసేందుకు ముందుకు వచ్చింది.  భారత్లోని సంస్థల తో కలిసి  ఆయుధాల ను అభివృద్ధి చేయడానికి సిద్ధం అయ్యింది.  ఐదు వేల కిలోమీటర్ల వేగాన్ని కలిగినటువంటి మిస్సైల్ తో  ప్రపంచంలోనే అతి గొప్ప సూపర్ షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ని  తయారు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆయుధ తయారీ రంగంలో భారత్ పరుగులు పెడుతున్న వేల అటు విదేశీ సంస్థ భారత సంస్థలతో కలిసి ఆయుధాల తయారీకి ముందుకు వస్తూ ఉండడం శుభపరిణామం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: