దేశంలోని ఏ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సరితూగవు.. ఇక్కడ ఉన్న ఎత్తులు, పై ఎత్తులు, ప్రణాళికలు, వ్యూహాలు ఏ రాష్ట్రంలోనూ ఎక్కువగా కనిపించవు. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటాయి. ఇక్కడి నేతలు విమర్శలు, వాగ్వాదాలు, ప్రసంగాలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే.. ఇక్కడ కులం, మతం, విద్వేషాలు, వింత వాదనలు వింటే  ఎంతటి జాతీయ నేత అయినా ఆశ్చర్యపోవాల్సిందే.. ముఖ్యంగా ఏపీ లో టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చాక వారి విమర్శలు చూస్తే ఎంతటి పొంతన లేకుండా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

 ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియాకి ఎక్కడం ఒక ఎత్తు అయితే  పాలనా వ్యవహారలపై  టీడీపీ పాత్ర శున్యం అని చెప్పాలి. సీఎం జగన్ కి ఏ ఒక్క విషయంలోనూ సలహా ఇచ్చిన పాపాన పోలేదు. రోజుకో ఇష్యూ తో పాలకవర్గానికి తలనొప్పి గా తయారయ్యారు.. ఏ వివాదం లేకుంటే ఓ వివాదాన్ని సృష్టించి మరీ ప్రభుత్వాన్ని నిందించడం టీడీపీ వారికి అలవాటైపోయింది.. గత కొన్ని రోజులుగా వారు చేసిన ఆరోపణలు చూస్తుంటే గుర్తింపు కోసం టీడీపీ పడే బాధలు స్పష్టంగా తెలుస్తుంది..

సంక్షేమ పథకాల అమలులో జగన్ ప్రభుత్వం ముందు ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని అంశాలను జగన్ ఇప్పటికే నిర్వర్తించారు. వాటితో పాటు మరికొన్ని అంశాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెనువెంటనే తీసుకొస్తోంది. ప్రభుత్వ నిర్ణయాల వేగం... ప్రజలకు దగ్గర అవుతున్న తీరు విపక్షాలకు ఇప్పుడు కంటిగింపుగా మారింది. ప్రతిష్టాత్మక సంస్థలు సైతం జగన్ ప్రభుత్వ విధానాల మీద ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మీద చేసిన సర్వేలో మంచి ఫలితాలు రావడం పక్షాలకు దిక్కుతోచని స్థితిలో పడేస్తోంది. దీంతోనే రోజుకో విషయాన్ని విద్వేషాన్ని ప్రజల్లో నింపి దానిమీద రాజకీయాలు చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.విపక్షాలు చేస్తున్న ఆందోళనలో చాలావరకు చాలా సిల్లీ అంశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, ధరల పెరుగుదల మీద కూడా విపక్షాల స్పందన చూస్తుంటే పనిగట్టుకొని మాత్రమే రోజు సోషల్ మీడియాలో ఆయా పార్టీల విభాగాలు ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: