కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.. మంత్రి కొడాలి నాని.. మాజీ మంత్రి దేవినేని ఉమ మధ్య మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నిన్న గొల్లపూడిలో దేవినేని ఉమను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేసారు. సీఎం జగన్ గురించి అవాకులు చెవాకులు పేలితే తన చేతిలో దెబ్బలు తప్పవని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. మంత్రి మాటలతో దేవినేని ఉమ హర్టయ్యారు. ఆ కామెంట్లను సీరియస్ గా తీసుకున్నారు.

అందుకే.. గొల్లపూడిలో నిరసన దీక్ష చేపట్టనున్న దేవినేని ఉమ ప్రకటించారు. నన్ను టచ్ చేసి చూడు అంటూ కొడాలి నాని కి మాజీ మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. ఉదయం 10 గంటలకు గొల్లపూడి యన్టీఆర్ విగ్రహం దగ్గర ఉంటా అంటూ సవాల్ విసిరారు. నాకు బడితపూజ చేయడానికి సీఎం వస్తారా లేక మంత్రి కొడాలి నాని వస్తారో రండి అంటున్నారు మాజీ మంత్రి  దేవినేని ఉమ. మంత్రి కొడాలి నాని విమర్శలకు నిరసనగా విజయవాడ గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షకు కూర్చుంటున్నా. నన్ను టచ్‌ చేసేందుకు సీఎం జగన్‌ వస్తారా? లేక దుర్భాషల మంత్రిని పంపుతారా? అన్నారు ఉమ.

మంత్రి కొడాలి నానికి ధైర్యముంటే నా నిరసన కార్యక్రమాన్ని ఆపాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్‌ విసిరారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఓర్వలేక జగనే దుర్భాషల మంత్రితో పిచ్చి మాటలు మాట్లాడించారని ఉమ మండిపడ్డారు. వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో జగన్‌ను నిలదీసే ధైర్యం మంత్రికి ఉందా? తొలుత సీబీఐ విచారణ కోరి, ఎన్నికలవగానే విచారణ వద్దని చేతులెత్తేసిన వ్యక్తి నన్ను, చంద్రబాబును తిట్టిస్తారా? సీఎం జగన్‌ భయపడే అమిత్‌ షా కాళ్లు పట్టుకునేందుకు దిల్లీ వెళ్తున్నారా అంటున్నారు దేవినేని ఉమ.

మరింత సమాచారం తెలుసుకోండి: