ఇలా ప్రాణాంతకమైన ఛాలెంజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సమయంలో అలాంటి చాలెంజ్ ఎవరు ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు అంటూ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇలాంటి ఒక ఛాలెంజ్ వృద్ధుడి ప్రాణం తీసింది. లైవ్ లో వోడ్కా లేదా హాట్ సాస్ తాగాలి ఓ యూట్యూబ్ సవాల్ విసిరాడు. ఈ రెండింటిలో ఏది తాగినా కూడా భారీగా డబ్బులు బహుమతిగా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రకటన రాగానే ఇది చూసిన ఎంతోమంది ఆ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే ఈ ఛాలెంజ్ చేసే వారికి ఎలాంటి వయస్సు నిబంధన పెట్టకపోవడంతో 60 ఏళ్ల వృద్ధుడు డబ్బు వస్తుంది అని ఆశతో ఆ పోటీలో పాల్గొన్నాడు. రష్యాకు చెందిన ప్యూరీ దుషకేచిన్ అనే వ్యక్తి పోటీకి సిద్ధమని లైవ్ లోనే 1.5 లీటర్ల వోడ్కా సేవించాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇక అంతలో లైవ్ లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వోడ్కా తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలి పోవడం తో నెటిజన్లు అందరూ షాక్ అయ్యారు. ఇక వెంటనే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి చెత్త చాలెంజ్ ల జోలికి ప్రజలు పోవద్దు అంటూ సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి