కర్ణాటకలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక మాండ్య జిల్లాలోని మద్దూర్ పరిధిలో బొమ్మనహళ్లి గ్రామానికి చెందిన సోహన్ బలరాం అనే యువకుడు ఫిబ్రవరి 5వ తారీఖున కేరళ వెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో పెళ్ళికి హాజరయ్యాడు. అయితే ఇదే పెళ్ళి తంతు పూర్తి అయిన తర్వాత దేవదాసు ప్రభాకర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు సోహన్. అతని దుకాణంలో కేరళ భాగ్య మిత్ర లాటరీ టికెట్ లను సోహన్ చూశాడు. ఇక ఇదేంటని స్నేహితుడిని అడిగితే.. కోటి రూపాయల లాటరీ టికెట్ అని చెప్పడంతో.. సోహన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వంద రూపాయలు పెట్టి ఒక లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు.
ఇక ఆ తర్వాత కేరళలో అన్ని రకాల వ్యవహారాలు పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం సమయంలో తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేయగానే కంగ్రాట్స్ నువ్వు కోటి రూపాయలు గెలుచుకున్నవు అంటూ స్నేహితుడు కాల్ చేసాడు. అయినప్పటికీ అతను మాత్రం నమ్మలేదు. ఇక ఆ తరువాత లాటరీ వివరాలు తెలుసుకొని అవాక్కయ్యాడు. ఆ లాటరీ 48 లక్షల మంది ఉంటే కేవలం ఐదుగురికి మాత్రమే కోటీశ్వరుడయ్యాడు ఛాన్స్ దక్కడం.. అందులో సోహన్ ఉండడంతో ఆనందంలో మునిగిపోయాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి