రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరనేది అందరికి తెల్సిన విషయమే కాని అవకాశం కోసం, స్వార్దం కోసం స్నేహం చేసే పార్టీలు ఎక్కువగానే కనిపిస్తుంటాయి. పార్టీలు మారని నాయకులు ఎవరైన ఉన్నారనే అనుమానాలు ఎవరికైన మదిలో కదలాడితే అటువంటి నాయకులను గుర్తు తెచ్చుకోవడం కోసం కొద్దిసేపు కష్టపడాల్సిందే. ఏ పార్టీ ఎందు కోసం స్దాపించబడిందో చెప్పడం కొంచెం కష్టమైనప్పటికిని రాజకీయ ఎత్తుగడులను ప్రదర్శించే సమయంలో తమ పార్టీ ఇందుకోసమే స్దాపించ బడిందనే విషయాన్ని ఆయాపార్టీల నాయకులు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం సర్వవిధాల చేసుకుంటున్నారు. ఏ సమయంలో ఏ పార్టీతో పొత్తులు కుదుర్చుకుంటున్నారో చివరి వరకు తెలియడంలేదు గాని తిట్టిపోసిన పార్టీలతో జతకట్టుకొని ప్రచారాల్లో మునిగి తేలుతుంటారు. ఇటువంటి సమయంలో నచ్చని ఓటర్లు ఛీ కొడతారు. నచ్చినవారు ఓట్లు వేస్తారు. కొన్ని నెలల తరువాత ఒక పార్టీ పై మరోపార్టీ చెప్పలేనంతగా విమర్శంచుకోవడం అక్కడక్కడ ముష్టి యుద్దాలు, రాళ్ళు రువ్వుకోవడాల వరకు వెళ్లడం జరిగిన సంఘటనలు రాజకీయ చరిత్రలో అనేకం ఉన్నాయి. పార్టీ పేరు చెప్పడం ఎందుకు గాని ఒక పార్టీ తో పొత్తు కుదుర్చుకొని అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీని గద్దెదింపి అదే పార్టీ ప్రభుత్వంలో మంత్రివర్గంలో కొనసాగిన పార్టీ క్రమంగా పొత్తును తెగతెంపులు తెచ్చుకొని ఎన్నికల సమయం వరకు ప్రధాన ప్రతిపక్షమైన మరో పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. దీంతో పొత్తుల సమయం నాటికి రాష్ట్రంలో కొన్ని ప్రధాన పార్టీలతో కలిసి పని చేశాయి, తర్వాత విడిపోయాయి. ఇక మిగిలింది రానున్నసాదారణ ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పార్టీ పొత్తు కుదుర్చుకుంటుదనే విషయం. ఇది ఇప్పుడే ఎవరికి అంతుపట్టదు. బహుశా ఆయా పార్టీల్లో ఉన్నటు వంటి రాజకీయ విశ్లేషకులు సైతం ఇంత ముందుగా ఈ విషయాన్ని అంచనా వేయలేరు. ఏ పార్టీ ఏ పార్టీతో కలిసినప్పటికిని నాయకులు ఏనాడు ఆశ్చర్యపడలేదు. ఇప్పటి వరకు అర్దం కానిది మాత్రం ప్రజలకే. ఇక తెలంగాణ ఉద్యమంలో మాత్రం బిజెపి, టిఆర్ఎస్ కల్సి పని చేస్తాయని మెజార్టీ ప్రజలు గ్రహించారు. నిజామాబాద్ ఉప ఎన్నికల వరకు బాగానే పనిచేశాయి. ఇక పాలమూరు ఉప ఎన్నికల్లో ఇరుపార్టీలను కలిసి పనిచేయించడం కోసం, అందులో ఒకరిని విత్ డ్రా చేయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చివరకు భాజపా గెలుపొందిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేవిధంగా పరకాల ఉప ఎన్నికల్లో రెండు పార్టీలే ఎక్కువగా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నాయి. అయితే ఇక్కడ మాత్రం రెండు పార్టీలు భవిష్యత్తులో కలిసి పనిచేసే విధంగా పరిస్థితుల కనిపించడంలేదు. ఇలా రాజకీయ ఎత్తుగడలతో పార్టీలు ముందుకెళ్తుంటే అర్థం కాని పరిస్థితిలో ప్రజలున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: