గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా పై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేసినప్పుడు రాజకీయ కక్షసాధింపు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు వీర్రాజు. ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబు అప్పుడు అమిత్ షా పై రాళ్లు వేయించారని మండిపడ్డారు. ప్రధాని మోదీని గతంలో ఆకాశానికెత్తేసిన చంద్రబాబు.. ఆ తర్వాత నల్ల జెండాలు చూపి నిరసన తెలియజేయడం రాజకీయ కక్షసాధింపులో భాగం కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఆ శూన్యత భర్తీ చేసేలా బీజేపీ–జనసేన కూటమికి ముందుకెళ్తుందని అన్నారు సోము వీర్రాజు. తిరుపతి ఉప ఎన్నికలపై ప్రస్తుతం బీజేపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇంధన ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ.. స్థానిక సమస్యలనే అజెండాగా చూపించి ఎన్నికలకు సిద్ధమవుతోంది బీజేపీ. అటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారం కూడా బీజేపీ మెడకు చుట్టుకునేలా ఉంది. వెరసి ఈ రెండు సమస్యలతో బీజేపీ తిరుపతి ఎన్నికల గెలుపు అవకాశాలను తనకు తానే తగ్గించుకున్నట్టయింది.
చంద్రాబబు సీఐడీ ఎపిసోడ్ పై బీజేపీ స్పందించింది కానీ, జనసేన మాత్రం నోరు మెదపలేదు. అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ గతంలో వ్యాఖ్యానించిన పవన్ కల్యాణ్.. సీఐడీ కేసుల విషయంలో స్పందించలేదు. సీఐడీ విచారణను ఆయన స్వాగతించలేదు. అటు టీడీపీ చేస్తున్న రాజకీయ కక్షసాధింపు ఆరోపణలను కూడా సమర్థించలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి