ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఎన్నో రకాల హోటళ్లు రెస్టారెంట్లు వెలుస్తున్నాయి.  ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వంటకాలకు కాకుండా హోటల్ భోజనానికి ఎక్కువగా అలవాటు పడుతున్న నేపథ్యంలో ఎన్ని హోటళ్లు వెలిసినప్పటికీ అన్ని హోటళ్ళలో కూడా ఫుల్ గిరాకి ఉంటుంది. అయితే నేటి రోజుల్లో ఆహారం ఎక్కడ చూసినా కూడా బాగా కాస్లీ గా మారిపోయింది.  ఇష్టమైన ఆహారం తినాలని ఉన్నప్పటికీ ఇక ఆహారం కొనాలి అంటే మాత్రం భారీగా ఖర్చు చేయాల్సి ఉండటంతో ఎంతోమంది కడుపునిండా తినలేక పోతున్నారు.  ఇలా హోటళ్లు ఆహారానికి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న తరుణంలో కొంతమంది మాత్రం స్వచ్ఛందంగా ప్రజల కడుపులు నింపేందుకు ముందుకు వస్తున్నారు.



 అతి తక్కువ ధరకే ఆహారాన్ని అందిస్తూ ఇప్పటికే ఎంతోమంది ఇక పేద ప్రజల కడుపు నింపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఒక మహిళ కూడా ఇలాంటిదే చేసి ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటోంది. ఆమె ఒక 70 ఏళ్ల వృద్ధురాలు.. ఇక అందరి కడుపు నింపడానికి ఒక హోటల్ స్థాపించింది.  అయితే సాధారణంగా ఎవరైనా హోటల్ పెట్టారు అంటే చాలు ఇక ఆ హోటల్ ఆహారం తినాలి అంటే బాగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న హోటల్ లో మాత్రం భారీగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.. మీకు ఇష్టమైనంత తినేందుకు కూడా అవకాశం ఉంటుంది.



 కేరళలోని కొల్లం రైల్వే స్టేషన్ దగ్గర యశోదమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఒక హోటల్ స్థాపించింది.  స్వయంగా అక్కడికి ఆహారం కోసం  వచ్చిన కష్టమర్లు లందరికీ కూడా వడ్డీ వడ్డీ ఇస్తూ ఉంటుంది.  ఇక ఈ హోటల్ లో మంచి ఆహారం దొరకడమే కాదు మనకు కడుపునిండా భోజనం కూడా చేయవచ్చు. నచ్చినంత తిన్న తర్వాత ఇక తిన్న ఆహారం మొత్తానికి ఇంత చెల్లించాలి అంటూ ఏమీ ఉండదు. మనకి నచ్చినంత ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇలా ఎంతో మంది కడుపు నింపుతుంది యశోదమ్మ. అయితే ఎదుటివారి కడుపు నింపడం లో ఎంతో సంతృప్తి ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ బామ్మ. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: