సాధారణ ఎన్నికల్లోనే చాలామంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ బొమ్మ వల్లే గెలిచారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఎమ్మెల్యేలు గెలిచాక కొందరు మంచి పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారు. ఇలా పనితీరు బాగోకపోయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచిందంటే? అది జగన్ బొమ్మ వల్లే అని చెప్పొచ్చు. జనం స్థానిక నాయకులకంటే జగన్ని దృష్టిలో పెట్టుకునే ఓట్లు గుద్దుతున్నారు. అందుకే కొన్నిచోట్ల టీడీపీ నేతలు ఎంత కష్టపడినా, ఫలితం మాత్రం వైసీపీకే అనుకూలంగా ఉంటుంది.
అయితే రెండేళ్ల పాటు జగన్ ఇమేజ్ తో బండి నడిపిస్తున్న ఎమ్మెల్యేలు ఇకనైనా కష్టపడితే పార్టీకి లాభం ఉంటుందని కొంతమంది వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. నియోజకవర్గంలో పెద్దగా పనిచేయకుండా కేవలం జగన్ బొమ్మ పట్టుకునే ముందుకెళితే కష్టమవుతుందని అంటున్నారు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు కూడా బాగానే కష్టపడుతున్నారు.
నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నారు. ఇలా కష్టపడుతూ వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా టీడీపీ నేతలు పని చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు కష్టపడినా సరే జగన్ ఇమేజ్ ముందు తేలిపోతున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టలేకపోయారు. అయితే రాబోయే మూడేళ్ళలో మరింత కష్టపడితే వైసీపీ ఎమ్మెల్యేల గెలుపు కష్టమవ్వొచ్చని తెలుస్తోంది. అప్పుడు జగన్ ఇమేజ్ కూడా పెద్దగా వర్కౌట్ కాదనే చెప్పొచ్చు. మొత్తానికైతే పనిచేయని ఎమ్మెల్యేలతో జగన్కు కష్టమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి