ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కో అజెండాతో ప్రజల ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు అంతా కూడా కేవలం వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు. అందుకుగానూ టీడీపీ గతంలో ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను పావుగా ఉపయోగిస్తోంది. ఈ హత్యతో వైసీపీకి ప్రత్యక్ష సంబంధం ఉందని పదే పదే వాదిస్తున్నారు. తద్వారా ప్రజల ముందు వైసీపీ ని బలహీనపరిచే ప్రణాళికలు చేస్తున్నారు. ఇది వరకు ముందే ప్రస్తావించుకున్నాం. మరియు అక్కడి తెలుగు దేశం పార్టీ స్థానిక నాయకులు సైతం ఈ విషయం గురించి అధికార వైసీపీని అడుగడుగునా ప్రశ్నిస్తోంది.

తాజాగా నారా లోకేష్ విసిరినటువంటి సవాల్ తో మరింత ఈ చర్చ ఆసక్తికరంగా మారింది.  లోకేష్ వైసీపీని ఉద్దేశించి మాట్లాడుతూ,  నిజంగా మీకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటే...వచ్చి ప్రమాణం చేయండి అన్నారు. అదే సమయంలో లోకేష్టీ వారి గురించి చెబుతూ టీడీపీ నాయకులు ఎప్పుడూ సిద్దమే, వివేకా హత్య కేసుకి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని మేము ప్రమాణం చేస్తాము అని లోకేష్ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి అయితే లోకేష్ కి కౌంటర్ ఇవ్వలేదు కానీ...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఒక లేఖను విడుదల చేశారు.

ముఖ్యంగా ఈ లేఖలో ఏముందంటే వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుతో మాకు సంభందం లేదని మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వివరించి ఉంది. గతంలో చాలా సార్లు వైసీపీ చెప్పిన విధంగా, టీడీపీ నాయకులు అయిన ఆది నారాయణ్ రెడ్డి, బీటెక్ రవి ప్రమేయం లేదని లోకేష్ ప్రమాణం చేయగలరా అని ఎదురు సవాలు విసిరారు వైసీపీ ఎమ్మెల్యే పార్ధ సారధి. అంతే కాకుండా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్ధ సారధి మాట్లాడుతూ, చంద్ర బాబు మరియు  లోకేష్ మీద పిర్యాదు డీజీపీ కి కూడా చేశాము అంటూ, ఈ ప్రమాణాలకు మేము రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే లోకేష్ స్థాయి ఇదే అని చెప్పడం..అంటే లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు కాబట్టి మా ఎమ్మెల్యేలు ఆయనకు సమాధానం చెప్పడమే ఎక్కువ అన్న.. భావనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే ఇప్పుడు ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పదించనున్నారో తెలియాల్సి ఉంది. మరియు రాజకీయ పరమైన సవాళ్ళను ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో ఎన్నికలు అయితే గానీ చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: