ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మళ్ళీ జగన్ ప్రభుత్వంపై కోపం వ్యక్తం చెయ్యడం జరిగింది.తెలుగు దేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర విషయంలో ఆంధ్ర ప్రదేశ్ న్యాయస్థానం జగన్ ప్రభుత్వంపై చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. విషయానికి వస్తే...దూలిపాళ్ళ నరేంద్రకు బుధవారం చేసిన కరోనా టెస్టులో నెగిటివ్ రావడంతో ఏసీబీ పోలీసులు ఆయన్ను తిరిగి రాజమండ్రి సెంట్రల్ ‌ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఏసీబీ కోర్టు అనుమతి లేకుండా ధూళిపాళ్లను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంపై న్యాయస్థానం జగన్ సర్కార్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. తమ పర్మిషన్ లేకుండా హాస్పిటల్ నుంచి జైలుకు తరలించే ప్రయత్నం చేయొద్దని కోర్టు పోలీసులకు గట్టిగా వార్ణింగ్ ఇచ్చింది. దీంతో పోలీసులు తిరిగి విజయవాడ ఆస్పత్రికి ధూళిపాళ్ల నరేంద్రని తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది.


ఇక ధూళిపాళ్ల నరేంద్రని సంగం డెయిరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఏసీబీ పోలీసులు అరెస్టు చేయడం జరిగిన సంగతి తెలిసిందే. ఇక నరేంద్రని కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఆయన్ను కస్టడీకి అప్పగించింది. ఇదే సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం బుధవారం మళ్లీ కరోనా టెస్టులు నిర్వహించగా ధూళిపాళ్లకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఏసీబీ పోలీసులు జైలుకు తరలించడం జరిగింది. అయితే వైద్యులు మాత్రం ఆయన్ను ఐసొలేషన్‌లో ఉంచాల్సిందిగా సూచించారు. దీంతో జైలు ప్రాంగణంలోనే ప్రత్యేక గదిలో ఐసొలేషన్‌లో ఉంచుతామని చెప్పి పోలీసులు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.అయితే తమ పర్మిషన్ లేకుండా ధూళిపాళ్ల నరేంద్రని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినందుకు ఏసీబీ కోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దూలిపాళ్ళ నరేంద్రని విజయవాడలోని హాస్పిటల్ కి తరలించాలని న్యాయస్థానం పోలీసులకి ఆదేశాలు జారీ చెయ్యడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: