అయితే ఈ మందు అందరూ వేసుకోకూడదట. దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. అవేంటంటే.. గర్భిణి స్త్రీలు ఆనందయ్య మందు వాడకూడదట. అలాగే రుతు స్రావంలో ఉన్న మహిళలు కూడా ఈ ఆనందయ్య కరోనా మందు వాడకూడదట. అలాగే ఈ మందు వాడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అవేంటంటే.. ఈ మందును ఫ్రిజ్‌లో ఉంచకూడదట. ఈ మందు వాడే సమయంలో మాంసాహారం తీసుకోకూడదట. ఈ మందు వాడితే ఆకలి ఎక్కువగా అవుతుందట. అందువల్ల ఆనందయ్య మందు వాడితే మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలట. అలాగే రోజూ 5 లీటర్లకు తక్కువ కాకుండా మంచి నీరు తాగాలని చెబుతున్నారు. ఈ నిబంధనలన్నీ పాటిస్తేనే ఆనందయ్య మందు సత్ఫలితాలు ఇస్తుందట.
ఈ బ్రేక్ సమయంలో ఆనందయ్యతో పలువురు నాయకులు కలుస్తున్నారు. తాజాగా.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆనందయ్య మందుకు ముందుగా మద్దతు తెలిపి.. పంపిణీని ప్రారంభించింది కూడా కాకాణి గోవర్థన్ రెడ్డే.
కృష్ణపట్నం ఆనందయ్య మందును సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందట. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే మందు పంపిణీ ప్రారంభిస్తామని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా ప్రకటించారు. ఆనందయ్య ఆయుర్వేద మందును చాలామంది కోరుకుంటున్నారని... అవసరమైన మేర మందు తయారీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలతో పాటు, జిల్లావ్యాప్తంగా అవసరమైన వారందరికీ అందజేస్తామని కాకాణి చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి