అసలే కరోనా.. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఉన్న ఉద్యోగాలు ఊడాయి. లాక్ డౌన్ దెబ్బకు వ్యాపారాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. అసలే జీతాల్లేవు.. కూలి పనులు లేవు.. తినడానికి సరైన తిండిలేదు. కటుంబం గడవడమే చాలా కష్టమైన పరిస్థితులొచ్చాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఆయిల్, పప్పు.. ఉప్పు.. కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. ఇది చాలదన్నట్టు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు సంస్థలు ఇష్టమొచ్చినట్టు పెరిగిపోయాయి. పెట్రోల్ అయితే సెంచరీ దాటిపోయింది. ఇంట్లో వినియోగించే గ్యాస్ ధర రూ.900రూపాయలు దాటింది. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అనే దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ప్రజలు.
ఒక్కసారిగా ఊహించని ఘటన జరుగడంతో.. అంతా షాక్ కు గురయ్యారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి