ఇవాళ బక్రీద్.. ఇలాంటి పండుగలప్పుడు అందరూ శుభాకాంక్షలు చెప్పడం మామూలే. అయితే రొటీన్‌ గా శుభాకాంక్షలు చెబితే ఏం బావుంటుందనుకున్నాడో ఏమో.. కమెడియన్ సునీల్ కాస్త వెరైటీగా శుభాకాంక్షలు చెప్పాడు. ముస్లింల తరహాలో టోపీ పెట్టుకుని.. మెడలో తాయెత్తు కట్టుకుని.. పచ్చగళ్ల కండువా మెడలో వేసుకుని ఓ ఫోటో పెట్టి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అని ఫేస్‌ బుక్‌లో పోస్టు పెట్టాడు. దీంతో ఇక నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రత్యేకించి హిందూ వాదులు సునీల్ మరీ ఓవర్ చేస్తున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఈ పోస్టుకు ఇప్పటి వరకూ 50 వేలకుపైగా లైకులు వచ్చాయి. ఈ పోస్టుపై ఏకంగా రెండున్నర వేల కామెంట్లు రావడం విశేషం అయితే.. అందులో ఎక్కువగా విమర్శలే ఉన్నాయి. “ ఏరా సునీలా ఎందుకురా అసలే నీ సినిమాలు పోతున్నాయి ఇప్పుడు కనీసం వేషం కూడా రావట్లే ఫీల్డ్ లో ఇవన్నీ అవసరమా నీకు..” అని ఒకరు కామెంట్‌ పెడితే.. “ సున్తీ కూడా చేసుకొని చెప్పు లేకపోతే వాళ్ళు నమ్మరేమో నిన్ను, తూ మీ బ్రతుకులు చెడ, ఈ రోజు హిందువులు జరుపుకునే ఏకాదశి గుర్తులేదు కానీ...." అని ఇంకొకరు కామెంట్ పెట్టారు.  


ఇంకొందరు.. " నిజమైన ముస్లింలు కూడా నీలాగా వేషధారణ చెయ్యలేరు సర్.. శుభాకాంక్షలు మామూలు వేషంలో కూడా చెప్పచ్చు.. ఇలా చెప్తే కానీ కుదరదు అని మీమీద వాళ్ళు ఫత్వా జారీ చేసారా.." అని ఒకరు.. “ కింద కూడా కోసుకో .....ఇంకా...సహజంగా ఉంటుంది....సుంతీల్... మామూలుగా శుభాకాంక్షలు చెప్పినా ఏమనుకునేవాళ్ళం కాము...మరీ ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా... అని ఇంకొందరు కామెంట్ చేశారు.


ఇంకొందరు సునీల్‌ ను సపోర్ట్ చేశారు. "అతనికి నచ్చిన రీతిలో అతడు పండుగ శుభాకాంక్షలు చెప్పాడు.. అందులో ఏమితప్పు మీకొచ్చిన నష్టమేమి.. మీకేమి కడుపుమంట..  అతన్నెందుకు విమర్శించడం.. అలా అయితే రాజకీయ నేతలు కూడా అదే వేషధారణలో శుభాకాంక్షలు తెలుపుతారు.. అప్పుడు మీకు చేతనైతే వారినికూడా విమర్శించండి... వాళ్ళను విమర్శించే ధైర్యం లేనపుడు ఇతన్ని ఎందుకు విమర్శిస్తున్నారు.. అతడు అణుకువగా దొరికాడా.. అతడు పెద్దనేరం చేసినట్టు కాకుల్లా పొడుస్తున్నారు.. ఏమి మనుషులురా బాబు.." అంటూ సునీల్‌కు మద్దతు తెలిపారు. మొత్తానికి సునీల్‌ పోస్టు మాత్రం చర్చనీయాంశం అయ్యింది.




మరింత సమాచారం తెలుసుకోండి: