ఢిల్లీ : వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కలవడంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు.  పోలవరానికి న్యాయం చేయాలని నిర్మల సీతారామన్ కోరారా? లేక తనపై ఫిర్యాదు చేయడానికే ఆమెను కలిశారా ? అని ప్రశ్నించారు  ఎంపీ రఘురామ. రాష్ట్ర ప్రభుత్వం తమ సామాజికవర్గానికి ఇష్టానుసారంగా ఉద్యోగాలు కేటాయిస్తుందని నిప్పులు చెరిగారు. A1 ముఖ్యమంత్రి కోసం గుర్రంపాటి దేవేంద్రర్ ను నియమించారా...? ఆవ భూముల్లో ముఖ్యమంత్రి బాబాయ్ పాత్ర కూడా ఉంది..130 కోట్లు ఎవరు కొట్టేశారో.. కొట్టేసిన వారి దగ్గర నుండి కూడా ఎవరు కొట్టేశారో కూడా అందరికి తెలుసు అని అన్నారు.

 ఆవ భూముల వివరాలు కేంద్రం చెప్పినట్టు నాకు పంపించాలన్నారు.  ఆవ భూముల కుంభకోణం పై ప్రధానమంత్రి,నిర్మలా సీతారామన్ కి  కూడా సీఎం జగన్ లేఖ ఇస్తే ప్రజలు సంతోషిస్తారని.. ఆవ భూముల అవినీతి పై ప్రధానికి,రాష్ట్రపతి,నిర్మలా సీతారామన్ కి కూడా లేఖ ఇస్తానని పేర్కొన్నారు. లక్ష్మిపార్వతి చక్కగా హరి కథలు తెలుగు లో చెప్పేవారు...తెలుగు అంటేనే ఎన్టీ రామారావు అనే..ఆమె ఇలా పదవుల కోసం మారడం మంచిది కాదని చురకలు అంటించారు.. బెయిల్ పై ఉన్న A1 ,A2 నీతులు వల్లిస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. దొంగలందరు కలిసి నిర్మలా సీతారామన్ కి పిర్యాదు చేస్తారా..?సీబీఐ విచారణలో బండారం బయట పడుతుందని హెచ్చరించారు. డిజిటల్ కార్పొరేషన్ ఎందుకు పెట్టారు...సామాజికవర్గానికి న్యాయం చేయడానికేనా?
 
సునీల్ కుమార్ అనే అధికారి సొంత భార్యా కంప్యూటర్ నుండి ఇతరలకు మెస్సేజ్ చేశారని.. అలాంటి వ్యక్తీ పై గృహహింస కేసు కూడా నమోదు అయింది...నిందితుడు అని కూడా తేలిందని తెలిపారు.  తన ఫోన్ దొంగలించారు దాన్ని ఉపయోగించి వేరే వారికి మెస్సేజ్ లు చేసే ఇప్పుడు నాపైనే కేసు నమోదు చేస్తున్నారని..  రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా పెగసెస్ వాడుతున్నారు అని గతంలో కూడా వార్తలు వచ్చాయన్నారు. సునీల్  కుమార్ వేసిన పిటిష్ న్ సాక్షికి ఎలా వచ్చిందని.. సునీల్ కుమార్ ఒక జాయింట్ డైరెక్టర్ ఈడికి పిర్యాదు చేస్తే.. విజయసాయిరెడ్డికి పిటిషన్ ఎలా వచ్చిందని మండిపడ్డారు. ఈడి జాయింట్ సెక్రటరీ గోయల్ పిటిషన్ ను విజయసాయిరెడ్డి కి ఇచ్చారో తేలాలి... A1, ముఖ్యమంత్రి అవుతారు అని నాలుగేళ్ల కింద ఊహించి ముందే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశానా? అంటూ మండిపడ్డారు.  సునీల్ కుమార్ బెయిల్ పై ఉన్నారు...సీబీ.సీఐడీ లీడ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: