ప్రాచీనకాలం నుండి ఈ భూమిపై ఉన్నటువంటి ఫంగస్ లు ప్రస్తుత మోడర్న్ జనరేషన్ లో మాత్రం అవి కూడా అప్డేట్ అయినట్లు మనవునిపై తమ ప్రభావాన్ని చూపి విజృంభిస్తున్నాయి. కొన్ని వేల  సంవత్సరాల నుండి అసలు ఫంగస్ గురించి ఎటువంటి అవగాహన లేని సమయం నుండి  మనిషి శరీరంలో  గోళ్లు, చర్మం వంటి భాగాలలో చిన్న చిన్న  రుగ్మతలను కలుగజేస్తున్న ఫంగస్‌ వ్యాధులు నేటి తరంలో మాత్రం మానవునిపై పగపట్టినట్టు విరుచుకు పడుతున్నాయి. అంతే కాకుండా ప్రాణాలకు హాని కలిగిస్తాయి.  ప్రపంచవ్యాప్తంగా ఈ ఫంగస్ గణాంకాలు చూస్తే మొత్తం మీద దాదాపు రెండున్నర లక్షలకు పైగా  ఫంగస్‌ జాతులు  ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే వాటిలో కేవలం మూడు వందల రకాలు మాత్రమే మనిషికి హాని కలిగించేవిగా గుర్తించబడ్డాయి. ఇక  ఎయిడ్స్‌ బాధితుల్లో రోగ నిరోధక శక్తి క్షీణించడం కారణంగా, న్యూమోసిస్టిస్‌, క్రిప్టోకాకస్‌, లాంటి ఫంగస్‌లు పంజా విసరాయి. అనంతరం ప్రపంచ దేశాలన్నింటిలోనూ  ఫంగస్‌ వ్యాధుల విజృంభణ నెమ్మది నెమ్మదిగా ఎక్కువ అవుతున్నట్లు  శాస్త్రవేత్తలు కనుగొన్నారు.  

ప్లేగు, డెంగీ, మలేరియా, క్షయ, పోలియో వంటి ప్రమాదకర రోగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో ఫంగస్‌ రుగ్మతలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇవన్నీ కూడా మూకుమ్మడిగా ప్రజారోగ్య వ్యవస్థలో దీర్ఘకాలం పాటు అంటిపెట్టుకుని ఉంటాయని వారు చెబుతున్నారు. కరోనా వైరస్ తో ఈ ఫంగస్ లకు ఆజ్యం పోసినట్లైంది. దేశవ్యాప్తంగా చూడగా మొత్తం 46,764 మంది బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు రికార్డ్స్ తెలుపుతుంది. అందులో 4,330 మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గతంలో 2009లో జపాన్‌ దేశస్తుల్లో చెవి సంబంధిత వ్యాధుల్లో గుర్తించినటువంటి కాండిడా ఆరిస్‌ అనే  ఫంగస్‌ అనతికాలంలోనే దక్షిణాఫ్రికా, యూకే, అమెరికా, దక్షిణ కొరియా, కెనడా, ఇండియా వంటి 19 దేశాలకు వ్యాప్తి చెందగా నేడు ఈ ఫంగస్‌కు కోవిడ్ మహమ్మారి తోడు కావడంతో అత్యంత హానికరంగా మారి ప్రజల ప్రాణానికే పెను ముప్పు గా తయారయ్యింది.

ఈ మధ్యకాలంలో పర్యావరణంలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పుల కారణంగా కూడా ఫంగస్‌లు మనుషులపై తమ ప్రభావాన్ని పెంచుతున్నాయి. ఫంగస్ ల పట్ల నిట్ల్యక్షం వహిస్తే  రానున్న రోజుల్లో ఇవే మానవాళికి పెను సవాలుగా మారి విరుచుకు పడే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మునుముందు కూడా చాలా  పరిశుభ్రంగా ఉండటం, భౌతికదూరం పాటించడం, మాస్క్‌ ధరించడం ముఖ్యంగా హాస్పిటల్స్ లో అత్యంత శుభ్రతను మెయింటైన్ చేయడం వంటివి కొనసాగించి జాగ్రత్తలు వహిస్తేనే ఈ ఫంగస్ ల భారిన పడకుండా సంరక్షించుకోవచ్చని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: