నేటి రోజుల్లో ప్రేమ అనే పదానికి అసలు వ్యాల్యూ లేకుండా పోయింది.  కేవలం అవసరాల కోసం పుట్టే ప్రేమ తప్ప ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని పుట్టే ప్రేమలు మాత్రం ఈ మధ్యకాలంలో చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. అవసరాల కోసం ప్రేమించడం అవసరాలు తీరిన తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇక బ్రేకప్ చెప్పుకున్న తర్వాత ఊరుకుంటారా మరొకరితో ప్రేమలో పడటం లాంటివి చేస్తున్నారు. ఇలా నేటి రోజుల్లో యువత ప్రేమ అనే దాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఒకరు కాకపోతే ఇంకొకరులే..  అని అనుకుంటున్నారు.


 కానీ ప్రేయసి కోసం ఏకంగా కొన్నేళ్లపాటు ఎదురు చూసే ప్రేమికులు ఎవరైనా కనిపిస్తున్నారా అంటే.. అలాంటి ప్రేమికులు కేవలం ప్రస్తుతం సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు. నిజ జీవితంలో మాత్రం ప్రస్తుతం ప్రేయసి కోసం ఏళ్ల తరబడి వేచి చూసే సమయం ఎవరికీ లేకుండా పోయింది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తన ప్రేమతో ఎంతో మంది మనసును కదిలిస్తున్నాడు. ప్రేయసి కోసం ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఒక్క ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు సదరు వ్యక్తి. ప్రేయసి వస్తుందేమో తనను ప్రేమగా పలకరిస్తుందేమో అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. కానీ చివరికి ప్రేయసి రాకపోవడంతో పిచ్చివాడిగా మారిపోయాడు.



 ఈ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.  తమిళనాడులోని మూలాక్కుడి కి చెందిన నాగ రాజన్ అనే 40 ఏళ్ల వ్యక్తి 21 ఏళ్ల క్రితం ఉపాధి కోసం కేరళకు వెళ్ళాడు. అక్కడ ఒక యువతి తో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని ఉన్నప్పటికీ తనకు తోబుట్టువుల పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది అని అనుకున్నాడు. అయితే రెండు వేల పెళ్లి చేసిన తర్వాత  మనం పెళ్లి చేసుకుందాం అంటూ ప్రియసీ తో చెప్పి తనతోపాటు తెచ్చుకున్నాడు  కానీ అంతలోనే ఆ యువతి తల్లిదండ్రులు వచ్చి బలవంతంగా అతని దగ్గర నుంచి ఆ యువతిని దూరం చేశారు   ఇక ఆ తర్వాత తోబుట్టువుల పెళ్లి చేసి తన బాధ్యతను తీర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత తన పెళ్లి చేసుకోకుండా తన ప్రేయసి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు. తన ప్రియ తిరిగి వస్తుందేమో అని ఏకంగా 21 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. కానీ చివరికి ఇక మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాడిలాగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: