మహిళలు అనేక రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నా వారికి రక్షణ అనేది కరువవుతోంది. మహిళలు మగవారితో సమానంగా తమ ప్రతిభను చాటడం ఎంతో గర్వించేదగ్గ విషయం. అయితే చాలా మంది స్త్రీలలో ఆలోచనా విధానం మారిపోతూ వస్తోంది. తమ హక్కుల కోసం, స్వాతంత్రం కోసం వారు అనేక పోరాటాలు చేస్తున్నారు. అర్ధరాత్రి మహిళలు నడవటానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు సమాన హక్కులు రావడానికి ఇప్పటికీ అనేక పోరాటాలు చేస్తున్నారు. నేటి రోజులలో స్త్రీ, పురుషులు మధ్య అనేక అసమానతలు ఉన్నాయని డబ్యూఈఎఫ్ నివేదించింది. 2006వ సంవత్సరంలో పోల్చితే ప్రస్తుతం స్రీ, పురుషుల మధ్య తారతమ్యాలు ఎక్కువైపోతున్నాయి. 

దీనిని డబ్యూఈఎఫ్ స్వయంగా నివేదించింది. ప్రపంచం మొత్తంగా చూస్తే 144 దేశాల్లో డబ్యూఈఎఫ్ పరిశోధన చేసింది. ప్రపంచంలో మహిళలకు అనేక హక్కులు ఉన్నప్పటికీ వారు వెనకబడే ఉన్నారు. వారికి సమానత్వం రావాలంటే ఇంకా 83 సంవత్సరాలు పడుతుందని 2016వ సంవత్సరంలో ఓ నివేదిక తయారైంది. మహిళల ఆరోగ్యం కూడా ప్రతి సంవత్సరం దిగజారుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తమ ఆరోగ్యం కంటే ఎక్కువగా తమ కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. అయితే అదే నివేదిక ఓ సంచలన విషయం  కూడా తెలియజేసింది. ఉద్యోగాలలో సమానత్వమనేది రావాలంటే స్త్రీలు 217 సంవత్సరాల పాటు ఎదురుచూడాలని ఆ నివేదిక చెబుతోంది.

స్త్రీ, పురుషుల సమానత్వం దాదాపుగా తగ్గువగానే ఉంది. ఇండియా 21 పాయింట్లు దిగజారి 108వ స్థానికి భారత్ దిగజారింది. మిగిలిన దేశాలైన చైనా, బంగ్లాదేశ్ కంటే కూడా భారత దేశం దిగజారి ఉంది.  మహిళలకు ఏదైనా ఉద్యోగం చేస్తే వారికి తక్కువగానే జీతాలనేవి వస్తున్నాయి. మహిళల ఆర్థిక వ్యవహారాలు దిగజారిపోతున్నాయని డబ్యూఈఎఫ్ పరిశోధనలో తేలింది. డబ్ల్యూఈ ఎఫ్ తమ పరిశోధనలను 170 కేటగిరీలలో చేసింది. ఆ నివేదికలో ఈ విషయాలు అనేవి వెల్లడయ్యాయి. మహిళల ఆరోగ్యంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, సిక్కిం, కర్ణాటక, ఏపీ, గోవా, మహారాష్ట్ర  మహిళల ఆరోగ్యాల గురించి ఆలోచిస్తున్నాయి. బీహార్ చివరి స్థానంలో ఉంది. తెలంగాణ 11, ఏపీ 12వ స్థానాల్లో ఉండటం విశేషంగా చెప్పోొచ్చు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్లు అయినా కూడా స్త్రీలు అసమానతలతో బాధపడుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: