స్వతంత్ర భారత దేశం నేటికి 74 వసంతములు పూర్తి చేసుకుని 75 వ వసంతంలోకి అడుగుపెట్టింది. దేశం నాటికి, నేటికి అన్ని రంగాలలోనూ ఎంతగానో పురోగతిని సాధించింది. ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారు, స్వేచ్చగా మాట్లాడుతున్నారు,స్వేచ్చగా జీవిస్తున్నారు. ఇదంతా మన స్వాతంత్ర్య సమర యోధులు తమ ప్రాణాలను సైతం అర్పించి మనకు పెట్టినటువంటి భిక్ష. మన తదుపరి తరాల కొరకు మేమెందుకు సమస్యల్లో చిక్కుకోవాలి అన్న ఆలోచన కానీ, ఎవరు ఏమైపోతే ఏంటి అన్న భావనలతో కానీ అప్పట్లో వారు బ్రిటీషు లకు ఎదురు తిరగకుండా వెనకడుగు వేసి ఉంటే నేడు మనకి స్వేచ్చ ఉండేదే కాదు. ఇప్పటికీ బానిస జీవితాలను భారంగా వెళ్ళదీసేవాళ్ళము. వినడానికే ఎంత దుర్భరంగా ఉంది. మరి అప్పట్లో ప్రజలు బానిస బ్రతుకులతో ఎంత చితికిపోయారో ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది.
 బ్రిటిష్ వారితో పోరాడి..తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి బానిస బ్రతుకుల నుండి భారతీయులకు స్వేచ్ఛను ప్రసాదించారు మన స్వాతంత్ర్య సమర యోధులు. మహాత్మా గాంధీ, అల్లూరి సీతారమరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సి లక్ష్మీబాయి, జతింద్ర నాథ్ దాస్, పోతిన వెంకన్న ఇలా ఎందరో మహనుభావులు త్యాగ ఫలమే నేడు మనము అనుభవిస్తున్నటువంటి  స్వేచ్ఛాయుత జీవితం. ఇంతటి గొప్ప వరాన్ని తమ రక్తాన్ని చిందించి మనకు అందించిన స్వాతంత్ర సమరయోధులను ఈ ఒక్క రోజు కాదు మన జీవితాంతం తప్పక గుర్తుంచుకోవాలి. స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారందరి గురించి తెలుసుకుని ఇటువంటి పరమ పవిత్రమైన రోజున వారిని స్తుతించుకోవడం మన ధర్మం. వారి అడుగుజాడలలో నడవడం మన భాధ్యత.

 ఇతరుల కొరకు ప్రాణాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ కనీసం కష్టాల్లో ఉన్న వారికి మన వంతు సాయం మనం చేయాలి. స్వార్థంలో మునిగిపోకుండా నిస్వార్థంగా జీవిస్తూ తోటి వారికి సహాయపడాలి. మనకెందుకులే అని సమర  యోధుల్లో ఏ ఒక్కరు అనుకున్నా మనకు నేడు ఈ స్వేచ్చ ఉండేది కాదేమో. అందుకే మనకు స్వాతంత్రం ప్రసాదించిన ఇటువంటి మహావీరుల చరిత్ర గురించి తెలుసుకోవాలి, వారి త్యాగాలను అర్దం చేసుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: