ఏపీలోని స్కూళ్లలో కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యార్థులు కరోనా బారిన పడగా.. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో 10మంది విద్యార్థులకు కరోనా సోకింది. స్థానిక మున్సిపల్ హైస్కూలులోని నాలుగవ తరగతి విద్యార్థులకు కరోనా సోకగా.. స్కూలులోని 160మంది విద్యార్థుల్లో 26మందికి టెస్టులు చేశారు. దీంతో మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 71వేల 532మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 1,601మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,06191కు చేరింది. తాజాగా 1,201మది కోలుకోవడంతో.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19లక్షల 78వేల 364కు చేరింది. కరోనా వైరస్ బారిన పడి మరో 16మంది చనిపోయినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 14,061యాక్టివ్ కేసులున్నట్టు పేర్కొంది.
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాక ఏదైనా బడిలో 5కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదైతే వెంటనే ఆ స్కూలును తాత్కాలికంగా మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల్లో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించాలని డిసైడ్ అయింది. చాలా మందికి వస్తే స్కూల్ సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేయించనుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లలో కరోనా భయం టెన్షన్ రేపుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి