
ఆదిపత్య పోరులో అనేక దేశాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అస్థిరతకు మారుపేరుగా చెప్పుకునే ఆఫ్రికాలోని చాలా దేశాల్లో స్థానిక ప్రభుత్వాలను ఉగ్రవాదులకు మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది. సహజవనరులను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి తామంటే తాము అని అధికారం కోసం చేసే యుద్దంలో సామాన్య ప్రజలు కీలు బొమ్మలుగా మారుతున్నారు.
ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న దేశాలు ఎక్కువగా అఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. అవి సోమాలియా, ఉగాండా, రువాండా, బుర్కినోఫాసో, నైజీరియా, కాంగో లాంటి తదితర దేశాలు. ఆ దేశాల్లో ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో చెప్పడం చాలా కష్టం. కొన్నిరోజుల క్రితం గినియాలో ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుతో గినియా ప్రభుత్వం పడిపోయి సైనిక పాలనలో ఇప్పుడు ఆ దేశం ఉంది. ఇటు గల్ఫ్ దేశాలైన సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఈ విధమైన పరిస్థితే కనబడుతుంది.
పాలనపై ఆధిపత్యం చెలాయించేందుకు చేస్తున్న పోరులో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అమెరికా బలగాలు అఫ్గన్ నుంచి వెనక్కి వెళ్లిపోవడంతో ఆ దేశాన్ని తాలిబన్లు స్వాధినం చేసుకున్నారు. 1966 నాటి అరాచక పాలన నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అఫ్గనిస్థాన్ లో మళ్లీ రక్తపాతం సృష్టించేందుకు తాలిబన్లు సిద్దమయ్యారు షరియా చట్టాల అమలు చేయడానికి ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతారో అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన నియంతృత్వ పాలనకు చాలా దేశాల ప్రజలు భయపడుతున్నారు.