చేతులు కలిపారు !
ఆగ్ర రాజ్యాలు చైనా, రష్యాల మధ్య స్నేహ సంబంధాలు  నానాటికీ పెరుగనున్నాయా ? ప్రపంచ దేశాలలో శాంతిని పురుద్దరించడంలో క్రీడలు కీలక  పాత్ర వహిస్తాయి.  ప్రతి ఒక్క రి లోనూ క్రీడా స్పూర్తి ఉండాలని అందరూ పేర్కొంటుంటారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముఖా ముఖి సమావేశాలు జరపనున్నారు ? ఇందుకు క్రీడలే వేదికగానున్నాయూ ? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే 2022లో జరగనున్న శీతాకాలపు  ఒలంపిక్ గేమ్స్ వరకూ ఆగాల్సిందే .. తాజాగా రష్యా అధ్యక్షుడు చైనా దేశపు ఆహ్వానాన్ని అందుకున్నారు. తమ దేశంలో జరిగే క్రీడోత్సవానికి హాజరు కావల్సిందిగా చైనా దేశం అధికారికంగా ఆహ్వానాన్ని పంపింది. ఈ విషయాన్ని రష్యా దేశపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సెర్గెవ్ లావ్రోవ్ స్వయంగా ప్రకటించారు.
చైనా దేశం కనుక ఆహ్వనించి ఉండక పోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ క్రీడలను బహిష్కరించి ఉండే  వారని కూడా  లావ్రోవ్  తెలిపారు. చైనా అధ్యక్షులు జిన్ పింగ్ ఆహ్వనం పంపడంపై పుతిన్ హర్షం వ్యక్తం చేశారన్నారు. బీజింగాలో 2022 ఫిబ్రవరిలో జరగనున్న శీతాకాలపు ఒలంపిక్
,క్రీడా సంబరాలకు రష్యా హాజరవుతుందని కూడా లావ్రోవ్ అన్నారు. ఈే క్రీడా సంబరాల సందర్భంగా ఇరువురు నేతలూ ముఖాముఖి సమావేశం అవుతారని, వివిధ అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంటుందని రష్యా భావిస్తున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివరించారు. ఈ  శీతాకాలపు ఒలంపిక్సలో రష్యా  క్రీడాకారులు తమ సత్తాను మరోసారి చాటుతారని లావ్రోవ్ తెలిపారు. ఇది ఇరు దేశాల  మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందిచేందకు దోహద పడాలని  తాను ఆకాంక్షిస్తున్నట్లు రష్యా మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల టోక్యోో నగరంలో ముగిసిన వేసవి ఒలంపిక్ క్రీడల్లో రష్యా క్రీడాకారులు  తటస్థ స్థితిలో క్రీడల్లో పాల్గోన్నారు. దీనికి కారణం లేకపోలేదు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ( డబ్ల్యూ. ఏ.డి.ఏ) రష్యా క్రీడాకారులపై నాలుగు సంవత్సరాలు విషేధం విధించింది. మాస్కో లెబొరెటరీలో వివిద డేటాలు తారుమారైన సంఘటనతో 2019 నుంచి  ఈ నిషేధం అమలులో ఉంది.  ఈ నిషేధం ప్రకారం రష్యా నాలుగు సంవత్సరాల ఎలాంటి అంతర్జాతీయ క్రీడలలో పాల్గోనరాదు.
కాగా  ఈ కాల పరిమితిని కోర్ట్ ఆఫ్ ఆర్బ్రట్రేష్ న్ ఫర్ స్పోర్ట్స ( సి.ఎ.ఎస్) రెండు సంవత్సరాలకు కుదించింది. దాని ప్రకారం ఈ ఏడాది  డిసెంబర్  తో నిషేధం  పూర్తవుతుంది.
టోక్యోలో జరిగిన  క్రీడల్లో రష్యన్ ఒలంపిక్ కమిటి  (ఆర్.ఓ.ఎస్) బ్యానర్ క్రింద  ఆటగాళ్లు కొన్ని విభాగాల్లో పోటీ పడ్డారు, 71 పతకాలు సాధించారు. వాటిలో ఇరవై బంగారు పతకాలు కావడం విశేషం. ఒలింపిక్ క్రీడల్లో పాల్గోన్న క్రీడాకారులందరికీ  రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కోనగరంలో ఉండే రష్యా అధికార భవనం క్రెమ్లిన్ లో విందు ఇచ్చారు. రష్యా పూర్వం లాగే క్రీడలకూ  తగిన ప్రాధాన్యం ఉస్తుందని పుతిన్ ఈ సందర్భంగా ప్రకటించారు. బీజీంగాలో జరగనున్న శీతాకాలపు ఒలంపిక్ క్రీడలు ఆగ్ర రాజ్యాల మధ్య ఏ మేరకు స్నేహ సంబంధాలను  ఏ మేరకు మెరుగుపరస్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: