భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మొదటి నుండి మతపర పార్టీగా పేరు ఉంది. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ ఒక మతం కోసం మాత్రమే పని చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఎన్నికల సమయం వస్తే వారికి అదే పెద్ద టాపిక్. కేవలం ఒక మతం కోసం పార్టీ పుట్టడం కొత్తేమి కాకపోయినప్పటికీ, మరీ బీజేపీ మాదిరి ప్రతీ దానిని మతానికి ముడిపెట్టి చూడటం మాత్రం అందరి వల్ల కావడం లేదు. ఒకపక్క భారత్ అనగానే భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడి ఉన్నప్పటికీ దానిని గౌరవించకుండా మతాన్ని ప్రాతిపదికన చేసుకొని పాలన చేయడం దేశభక్తి ఎలా అవుతుందనేది కొందరి ప్రశ్న.

ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం బీజేపీకి సాధ్యం కానిపని. ఎప్పుడు ఏదో ఒక మతంపై లేదా ఆయా మతాలలో ప్రముఖంగా గుర్తించిన వారిని ఉద్దేశించి ఇష్టానికి విమర్శలు చేస్తూ లేనిపోని పరిస్థితులను సృష్టించడం వాటితో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం ఆ పార్టీ నేతలకు మాత్రమే సాధ్యం. అయినా ప్రపంచ స్థాయి మానవీయులను కూడా మతప్రాతిపదికన చూడడం అనేది హేయమైన చర్య. గాంధీ, మదర్ తెరిస్సా తదితరులకు కూడా కులం, మతం అంటకట్టి మాట్లాడంటం ఎంత వరకు సమంజసం అనేది వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు. ఆయా రంగాలలో వాళ్ళు చేసిన విశేష సేవలను బట్టి వాళ్ళను ప్రపంచం తల్లిగా గుర్తించడం జరిగింది. అయినప్పటికీ వాళ్లకు మతాన్ని అంటగట్టి చూడడం బీజేపీ నేతల దిగజారుడు రాజకీయాలకు మచ్చుతునక.

తాజాగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఈ తరహా విమర్శలు చేశారు. మదర్ తెరిస్సా కు మతం అంటకట్టి మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. హిందూ మతంలో చెప్పుకునే ఋషులు, మహర్షులు కావాలంటే ఎన్నో గొప్ప పనులు చేయాల్సి ఉంటుంది. కానీ సెయింట్ హోదా పొందాలి అంటే కేవలం మ్యాజిక్కులు, గిమ్మిక్కులు చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. మైసూర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం మ్యాజిక్ తో ఒక వ్యక్తి కాన్సర్ గడ్డను కరిగించడం తో తెరిస్సా కు సెయింట్ హోదా వచ్చేసిందని ఆయన అన్నారు. దీనిపై అనేక వర్గాలు మండిపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp