నెల్లూరు అంటే వైసీపీ....వైసీపీ అంటే నెల్లూరు...ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే నెల్లూరు ప్రజలకు వైఎస్సార్ ఫ్యామిలీపై అభిమానం ఎక్కువే. అందుకే ఇక్కడ మొదట నుంచి టి‌డి‌పికి పెద్ద ఆదరణ ఉండదు. ఇక గత రెండు ఎన్నికల్లో కూడా అది రుజువైంది. ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్‌లో పూర్తిగా వైసీపీ ఆధిక్యం ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఇక్కడ పరిస్తితి ఎలా ఉందంటే...ఒకవేళ రాష్ట్రంలో టి‌డి‌పి గాలి వీచినా కూడా నెల్లూరు పార్లమెంట్‌లో మాత్రం ఫ్యాన్ గాలి వీచేలా ఉంది.

గత ఎన్నికల్లో కూడా నెల్లూరు పార్లమెంట్‌లో పూర్తిగా వైసీపీదే ఆధిక్యం. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీదే విజయం. కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి, కందుకూరు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీనే గెలిచింది. అది కూడా భారీ మెజారిటీలతో గెలిచింది. ఏదో సిటీలో మాత్రం స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచింది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయిపోతుంది....ఇప్పుడుప్పుడే వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ నెల్లూరు పార్లమెంట్‌లో కూడా కాస్త పరిస్తితి అలాగే ఉంది. కాకపోతే వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే టి‌డి‌పి మీద పాజిటివ్ లేదు. ఇక్కడ టి‌డి‌పి పెద్దగా పికప్ అవ్వలేకపోతుంది. ఏడు నియోజకవర్గాల్లో ఒక్క సిటీలో మాత్రం టి‌డి‌పి పరిస్తితి బాగుంది. ఇక్కడ టి‌డి‌పి నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు.

దీంతో సిటీలో టి‌డి‌పి కాస్త పికప్ అయింది. అటు రూరల్‌లో టి‌డి‌పి నేత అబ్దుల్ అజీజ్ దూకుడుగానే పనిచేస్తున్నారు గానీ, అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నారు. దీంతో టి‌డి‌పి పికప్ అవ్వలేకపోతుంది. ఇక కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, కందుకూరు అసెంబ్లీ స్థానాల్లో టి‌డి‌పి ఏ మాత్రం పికప్ అవ్వలేదు. మొత్తానికి నెల్లూరు పార్లమెంట్‌లో టి‌డి‌పి లీడ్‌లోకి వచ్చేలా కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp