కానీ ఏపీలో ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేని బిజేపి....టిడిపితో పొత్తు పెట్టుకునేదే లేదని తేల్చి చెప్పిసిందట. పైగా ఏపీలో టిడిపి స్థానాన్ని బిజేపి రీప్లేస్ చేయాలని బాగా ట్రై చేసింది. అయితే ఇవేమీ జరగలేదు. అసలు చంద్రబాబు...బిజేపితో పొత్తు పెట్టుకోవాలని కూడా ట్రై చేయలేదనే తమ్ముళ్ళు అంటున్నారు. బిజేపితో పొత్తు వద్దే వద్దు అని తమ్ముళ్ళు గట్టిగానే చెబుతున్నారు.
అయితే బిజేపి నేతలు కొందరు టిడిపిని తక్కువ చేసి మాట్లాడుతూ, ఆ పార్టీతో పొత్తు లేదని పలు సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా కూడా ఒక ఉత్తరాది నేత...ఇటీవల విజయవాడ వచ్చి...టిడిపిపై సంచలన వ్యాఖ్యలు చేశారని తెలిసింది. తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో పూర్తిగా తుడిచి పెట్టేలా బీజేపీ నేతలు, కేడర్ పనిచేయాలని, బీజేపీ అంటే పార్కింగ్ పార్టీ కాదని, టీడీపీతో భవిష్యత్తులో పొత్తు ఉండబోదని హడావిడి చేసి వెళ్లిపోయారట.
ఇక ఈ వ్యాఖ్యలపై మాజీ టిడిపి నేతలు మండిపోతున్నారట...అంటే బిజేపిలో ఉన్న టిడిపి నేతలు. సుజనా చౌదరీ, సిఎం రమేష్, ఆదినారాయణరెడ్డి లాంటి వారు ఆ ఉత్తరాది నేతపై ఫైర్ అయిపోతున్నారట. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఆ నాయకులు ఫిక్స్ అవుతున్నారట. ఇలా మాట్లాడితే టిడిపి నుంచే వచ్చే నాయకులు కూడా రారని చెబుతున్నారట. అయినా టిడిపి వాళ్లే...బిజేపి పొత్తు అసలు వద్దని చెప్పేస్తున్నారు...ఇంకా బిజేపి నేతలు చెప్పేది ఏంటని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి