గత ఎన్నికల్లో జగన్ గాలిలో చాలామంది యువ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. టీడీపీలో ఉన్న బడా నేతలనీ ఓడించి ఎమ్మెల్యేలు అయ్యారు. అలా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో వెంకట్ గౌడ వైసీపీ నుంచి నిలబడి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని ఓడించారు. మామూలుగా అమర్నాథ్‌కు చిత్తూరు జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అనేక ఏళ్ళు టీడీపీలో కీలకంగా పనిచేస్తూ వస్తున్న నేత.

అయితే మధ్యలో అమర్నాథ్ వైసీపీలోకి జంప్ చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పలమనేరు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో, మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు. అలాగే చంద్రబాబు, అమర్నాథ్‌కు మంత్రి పదవి సైతం వచ్చారు. మంత్రి పదవి వచ్చాక నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో వెంకట్ చేతిలో ఓడిపోయారు.

ఓడిపోయాక అందరి నాయకుల మాదిరిగా సైలెంట్ గా ఉండకుండా, పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై గట్టిగానే గళం విప్పుతున్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే యువ ఎమ్మెల్యే వెంకట్ కూడా దూకుడుగానే పనిచేస్తున్నారు. రాజకీయంగా ఇంకా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎక్కువగా చేసే అభివృద్ధి కార్యక్రమాలు కనబడటం లేదు. ఏదో సంక్షేమ పథకాల తప్ప, వేరే పనులు జరగడం లేదు.

అటు సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. రోడ్ల పరిస్తితి దారుణం..తాగునీరు సమస్య కూడా ఎక్కువే. అసలు నియోజకవర్గంలో ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దీంతో పలమనేరు ప్రజలు మళ్ళీ అమర్నాథ్ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే రాబోయే రెండున్నర ఏళ్లలో ఎమ్మెల్యే వెంకట్ ఇంకా దూకుడుగా పనిచేసి బలపడితే పరిస్తితి వేరుగా ఉండొచ్చు. ఏదేమైనా ఈ సారి పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, వెంకట్ గౌడల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: