కరోనా వైరస్ సమయంలో వైద్యులు ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు పోతాయని.. ఎంతో ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ కుటుంబం గురించి ఆలోచించకుండా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్ధమైపోయారు. సరిహద్దుల్లో దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికుల లాగా ఏకంగా దేశం మధ్యలో ఎంతో మంది ప్రాణాలకు రక్షణ కల్పించారు వైద్యులు. అడిగితే ఆ దేవుడైన వరాలు ఇస్తాడో లేదో తెలియదుగానీ అడగకముందే ఎంతోమందికి వరాలు ఇచ్చి ప్రాణాలు నిలబెట్టారు వైద్యులు.



 కరోనా వైరస్ సమయంలో వైద్యులు ఎక్కువగా పిపిఈ కిట్ ధరించి కనిపించడం చూసాం. పీపీఈ కిట్ ధరించిన తర్వాత రోగులకు చికిత్స చేయడం చేస్తున్నారు వైద్యులు. ఇక నేటి రోజుల్లో కూడా ఎంతో మంది వైద్యులు ఇలా పీపీఈ కిట్ ధరించడం చూస్తూన్నాం. అయితే ఇప్పుడు వరకు ఇలా పీపీఈ కిట్లు ధరించిన వైద్యులను చూశారు. కానీ ఇక్కడ వైద్యులు మాత్రం కాస్త డిఫరెంట్  ఏకంగా హెల్మెట్ ధరించి చికిత్స అందిస్తున్నారు.  ఇక ఇలా వైద్యులు హెల్మెట్ ధరించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్.. అది సరేగాని ఇది ఎక్కడ జరిగింది అనుకునేరు.


 అలా అనుకుంటే పొరపాటే ఎందుకంటే.. ఇది ఎక్కడ జరిగింది ఎక్కడో కాదు మన ఉస్మానియా ఆస్పత్రిలోనే. ఉస్మానియా ఆస్పత్రిలోని వైద్యులు ఇలా తలకు హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యారు.  హెల్మెట్ తీయకుండానే అటు రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఫోటో చూస్తుంటే ఏదో అర్జెంట్ కేసు ఉంటే బైక్ పార్క్ చేసి హెల్మెట్ తీయకుండా అలాగే వైద్యులు వచ్చినట్లు కనిపిస్తుంది కదా. కానీ కాదు ఇటీవలే ఆసుపత్రిలో శిధిలమైన సీలింగ్ ఫ్యాన్ లను చూసి డాక్టర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఫ్యాన్లు ఎక్కడ మీద పడిపోతాయో అని వణికిపోతున్నారు  ఇటీవలే ఆసుపత్రిలో సీలింగ్ ఫ్యాన్ ఊడి ఒక వైద్యురాలు తలకు గాయమైంది. ఇక అప్పటి నుంచి డాక్టర్లు ఇలా హెల్మెట్ పెట్టుకుని విధులకు హాజరవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: