ఇక ఇప్పుడు మరికొంతమంది మహిళలు కూడా తమ హక్కులు సాధించుకోవడం కోసం అర్ధనగ్నచేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇది జరిగింది మన దేశంలో కాదు ప్రస్తుతం అగ్ర దేశంగా కొనసాగుతున్న ఇటలీలో. ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేసింది సినీ సెలబ్రిటీ లో లేదా సామాన్య ప్రజలో కాదు. ఏకంగా ఎయిర్‌హోస్టస్ ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఇక ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేసింది ఒక్కరో ఇద్దరో అనుకుంటే పొరపాటే ఏకంగా 50 మంది ఎయిర్‌హోస్టస్ ఇలా అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు.
ఇటలీలోని అలిటాలియ ఎయిర్‌లైన్స్ కు చెందిన 50 మంది ఎయిర్‌హోస్టెస్ ఏకంగా నడి రోడ్డుపై అర్థనగ్నంగా నిరసన చేపట్టారు. రోమ్ లోని టౌన్ హాల్ ముందు తమ యూనిఫామ్ లను విప్పుతూ ఆందోళన చేశారు. జీతంలో కోతలు, ఉద్యోగాలు తొలగించడంపై ఎయిర్ హోస్టెస్ లు ఇలా నిరసన తెలిపారు అయితే ఇటీవలే alitaliya ఎయిర్‌లైన్స్ ను ఐటిఎ ఎయిర్వేస్ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలోనే పాత ఉద్యోగుల లో ఎంతో మంది ని పక్కకు పెట్టేసింది. కొంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. దీంతో ఐటీఏ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50 మంది ఎయిర్‌హోస్టెస్ లు ఇలా ఏకంగా అర్ధనగ్న ప్రదర్శన చేయడం మాత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.