కర్నూలు జిల్లా అంటేనే టీడీపీకి పెద్దగా పట్టు లేని జిల్లా అని చెప్పాలి...ఆ జిల్లాలో ఉన్న ఎక్కువ నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా లేవు. అలా అనుకూలంగా లేని నియోజకవర్గాల్లో నందికొట్కూరు కూడా ఒకటి. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి...టీడీపీలో ఉన్నంత కాలం నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగిరింది. చివరికి 1999 ఎన్నికల్లో అక్కడ టీడీపీ గెలిచింది. ఆ తర్వాత నుంచి పార్టీ గెలవలేదు. పైగా ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం అయ్యాక టీడీపీకి గెలుపు దక్కలేదు.

దీనికితోడు బైరెడ్డి రాజశేఖర్ సైతం టీడీపీని వదిలాక పరిస్తితి మారిపోయింది. అదే సమయంలో బైరెడ్డి సోదరుడు తనయుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీలో చేరాక నందికొట్కూరు వైసీపీ కంచుకోటగా మారింది. ఇక యువ నేత బైరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. ఆయన బట్టే నందికొట్కూరులో గెలుపోటములు డిసైడ్ అయ్యే పరిస్తితి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున ఆర్థర్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థర్ గెలుపుకు బైరెడ్డి ప్రధాన కారణం.

పేరుకు ఆర్థర్ ఎమ్మెల్యే గానీ, ఇక్కడ పెత్తనమంతా బైరెడ్డిదే. ఇలా బైరెడ్డి అడ్డాగా ఉన్న నందికొట్కూరులో టీడీపీ పరిస్తితి మరీ దారుణంగా ఉంది. అసలు ఇక్కడ టీడీపీ ఉందా? అనే పరిస్తితి. ఇక్కడ టీడీపీకి సరైన నాయకులు కూడా లేరు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన బండి జయరాజు ఇప్పుడు అడ్రెస్ లేరు. చంద్రబాబు సైతం...మరో నాయకుడుకు బాధ్యతలు అప్పగించలేదు.

అయితే నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న గౌరు వెంకటరెడ్డి..నందికొట్కూరులో టీడీపీని కాస్త నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బలమైన నాయకుడుని ఇంచార్జ్‌గా పెడితేనే నందికొట్కూరులో టీడీపీ నిలబడుతుంది...లేదంటే నందికొట్కూరుని మర్చిపోవాల్సింది. బైరెడ్డి లాంటి బలమైన నాయకులని ఢీకొట్టే విషయం చంద్రబాబు ఇంకాస్త ఫోకస్ చేసి నందికొట్కూరులో పార్టీని నిలబెట్టాలి. మరి చంద్రబాబు, బైరెడ్డి అడ్డాలో టీడీపీని నిలబెడతారో లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: