జగన్ కూడా రజినిపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో పేటలో ఉన్న వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ని పోటీలో నుంచి తప్పించారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి...చిలకలూరిపేట బరిలో రజినిని నిలబెట్టారు. అయితే రజిని అపోజిట్ టీడీపీ సీనియర్ ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారు...అసలు ఆయన్ని ఓడించడం రజినికి సాధ్యం కాదని, సొంత వైసీపీ పార్టీ నేతలే మాట్లాడుకున్న పరిస్తితి.. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎమ్మెల్యేగా రజిని విజయం సాధించారు.
గెలవడమే కాదు..రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు..తనదైన శైలిలో రాజకీయం చేస్తూ...రాష్ట్ర వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇలా మంచి ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న రజినికి సొంత పార్టీ నేతలతో విభేదాలు కూడా నడుస్తున్నాయి. మర్రి వర్గానికి, రజిని వర్గానికి అసలు పడటం లేదు. రజినిపై మర్రి వర్గం గుర్రుగా ఉంది..నెక్స్ట్ ఎన్నికల్లో రజినికి ఎలాగైనా చెక్ పెట్టి సీటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
పైగా ఎమ్మెల్సీ కూడా దక్కకపోవడంతో నెక్స్ట్ పేట సీటు దక్కించుకోవాలని మర్రి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జగన్...మర్రికి ఎమ్మెల్సీ పదవి ఫిక్స్ చేశారని తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని సమాచారం. అంటే మర్రికి ఎమ్మెల్సీ ఇస్తే...ఇంకా పేట సీటు విషయంలో రజినికి ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి. మళ్ళీ రజిని చిలకలూరిపేట బరిలోనే దిగనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి