దీంతో మహిళల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. మొన్నటివరకు ప్రజాస్వామ్య పాలన లో మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించారు. వ్యాపార వాణిజ్య రంగాల తో పాటు అటు క్రీడా రంగాల్లో కూడా ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కాని ప్రస్తుతం మాత్రం మహిళల జీవితాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయ్ అని చెప్పాలి. ఎందుకంటే తాలిబన్లు ఆధిపత్యం లోకి వచ్చిన తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన క్రీడాకారునులను గుర్తించి దారుణంగా హత్యలు చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఎంతో మంది క్రీడాకారులు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.
అయితే ఇలా తాలిబన్ల అరాచకాలకు తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన మహిళ క్రీడాకారులకు భారత్తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తాలిబన్ల ఆధిపత్యం లోకి రాకముందు పోలీస్ శాఖలో న్యాయ శాఖ లో కొనసాగిన మహిళలకు ఇజ్రాయిల్, అమెరికా కూడా ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. తమ వాళ్లను నమ్మ లేక ఇతర దేశాల సహకారాలు కోరుతూ అజ్ఞాతంలోకి ఎంతోమంది మహిళలు వెళ్లి పోయారు అని విశ్లేషకులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి