ఇటీవలే ఏపీ అసెంబ్లీ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజున అటు ప్రతిపక్ష అధికార పక్షం మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ప్రతిపక్ష టిడిపి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి రాక్షస రాజకీయాలను తాను చూడలేదు అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏకంగా కుటుంబ సభ్యులను కూడా ప్రస్తావనకు తీసుకువచ్చి దారుణంగా దూషిస్తున్నారు అంటూ ఎమోషనల్ అయ్యారు చంద్రబాబు నాయుడు. అసలు రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేని తన భార్యను దూషించడం తనకు ఎంతగానో బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు.



 ఈ క్రమంలోనే ఇక అసెంబ్లీ వేదికగా ఎంత గానో ఎమోషనల్ గా ప్రసంగం చేసిన చంద్రబాబు నాయుడు.. ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీఅసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపథం  చేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన శపథం కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని శపథం చేయడం వరకూ బాగానే ఉంది.. మరి ప్రజలకు మంచి చేయడానికి చంద్రబాబునాయుడు ఎప్పుడు శపథం చేస్తారు అంటూ  విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.



 ప్రజల కోసం శపథం చేసి ఇక ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వంతో పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధమవుతారు అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్నా చంద్రబాబు నాయుడు ఇలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి అసెంబ్లీలో అడుగు పెట్టబోను అంటూ శపథం  చేయడంపై మాత్రం విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపథం  చేసిన తర్వాత.. ప్రజల కోసం శపథం  ఎప్పుడూ అంటూ విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉండటం  గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: