అబ‌ద్ధాలు చెప్పే తీరు ఇది కాదు విజ‌య సాయి గారూ! ఛ ఇలా చెప్పి చెప్పి మ‌మ్మ‌ల్ని ఎందుకు విసిగించి చంపుతారు. చావు త‌ప్ప క‌న్ను లొట్ట‌బోయిన విధంగా  మా జీవితాలు ఉన్నాయి  క‌దండి. మ‌రి! మీరేంటి పిట్ట కూత‌లు కూడా స‌రిగా కూయ‌లేక‌పోతున్నారు. వ‌ద్దండి అన్ని అబ‌ద్ధాలు ఆరోగ్యాన్ని ఇవ్వ‌వు. తిరుప‌తి వెంక‌న్న కూడా కాస్త కూడా మిమ్మ‌ల్ని ఎక్స్ క్యూజ్ చేయ‌డు స‌ర్.. ఎందుకొచ్చిన గొడ‌వ ఈ వ‌య‌స్సులో  మీరు పార్ల‌మెంట్ వేదిక‌గా అబ‌ద్ధాలు చెప్ప‌డ‌మో లేదా విశాఖ కేంద్రంగా అబ‌ద్ధాలు చెప్ప‌డ‌మో లేదా తాడేప‌ల్లి ప్యాలెస్ కేంద్రంగా అబ‌ద్ధాల‌ను నిజాలుగా మార్చే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మో! వ‌ద్దులేండి స‌ర్.. మాకు నిజాలు తెల్సు న‌ల్ల చ‌ట్టాల రంగు ఎలా ఉంది అన్న‌ది ఎలా వెలిసింది అన్న‌ది మాకు తెల్సు. సో.. ఈశ్వ‌రుడు నోరిచ్చాడు క‌దా అని ఏది ప‌డితే అది ఎలా ప‌డితే అలా మాట్లాడ‌కండి స‌ర్...వినేందుకు బాగోదు.

అస‌లీ న‌ల్ల చ‌ట్టాల‌కు అదేలేండి రైతు పేరుతో తీసుకువ‌చ్చిన న‌ల్ల చ‌ట్టాల‌కు ఆకుప‌చ్చ రంగు ఎలా అంటుంకుందో కానీ అంటేసు కుంది. అదేలేండి వైసీపీ జెండా రంగులో ఓ రంగు. అందుకే వాళ్లేం చెప్పినా విభిన్న‌తకు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. లేదా వాస్త‌వాల‌కు దూరంగా ఉంటాయి ఆ మాట‌లు లేదా ఆ ప‌నులు. ఎస్.. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కూ వైసీపీకీ ఏం సంబంధం? ఆ రోజు అడ‌గ కుండానే మాకు మ‌ద్ద‌తిచ్చిన పార్టీ వైసీపీనే అని రైతు చ‌ట్టాల విష‌య‌మై బీజేపీ ఇచ్చిన స్టేట్మైంట్ ను వైసీపీ మ‌రిచి పోయి ఉంటుంది. లేదా నిద్ర క‌ళ్ల‌తో ఓటేసి వ‌చ్చి ఉంటుంది. అందుకే ఇదంతా అన‌గా చ‌ట్టాల ర‌ద్దంతా మాదే అని ప్ర‌గ‌ల్బాలు ప‌లికి వెకిలి న‌వ్వుల‌ను బ‌దులుగా తీసుకోవ‌డం ఆ పార్టీకి ఎందుకో కాస్త ఇష్టంగానే ఉంది.

రాజ‌కీయం అంటేనే మాట‌లు వండి వార్చ‌డం.. మాట‌లు నేర్పుగా సంభాష‌ణ‌లు తీయ తీయ‌గా పుల్ల పుల్ల‌గా ఉండేలా చేయ‌డం. అలా చేయడంతోనే ఆయ‌న‌కు పేరు వ‌చ్చింది. రెండో ముఖ్య‌మంత్రిగా ఆయ‌నకు రాష్ట్రంలో ఎన్న‌ద‌గిన గుర్తింపు కూడా వ‌చ్చింది. అలా చేయ‌డంతోనే ఉత్సాహం నిండుకుని ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రినీ డైల‌మాలో ప‌డేసే విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఇవి విని మ‌నం న‌వ్వుకోవాలి. విశాఖ కేంద్రంగా వైసీపీ హ‌యాంలో చేసిన ఉద్య‌మాలేంటి? రైతు కోసం చేప‌ట్టిన నిర‌స‌న‌లు ఏంటి?
ఇవి కూడా అడిగి చూడండి ఆయ‌న ఏం అంటారో ఏ విధంగా ప్ర‌తిస్పందించి పంపుతారో కూడా మీకే అన‌గా మీడియాకే తెలిసివ‌స్తుంది.
కేంద్రం దిగివ‌చ్చాక వ‌చ్చిన మాట‌లు వినండి బాగుంటుంది. విజ‌య సాయిరెడ్డి చెప్పే మాట‌లు అస్స‌లు ఎంత బాగున్నాయో కూడా ఒక్క‌సారి విని త‌రించి చూడండి. ఏం కాదు. వ్య‌వ‌సాయ బిల్లుల‌కు ఆ రోజు అడ‌గ‌కుండానే మ‌ద్ద‌తు ఇప్పుడు ర‌ద్ద‌య్యాక మా పోరాటం ఫ‌లించింద‌ని స్టేట్మెంట్ ఇచ్చి  అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు ఆయ‌న. బుల్లి పిట్ట మాధ్య‌మం ద్వారా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు.
దీంతో ఇది చ‌దివి విని టీడీపీ తో స‌హా విప‌క్షం అంతా న‌వ్వుకుంటోంది. ఏడాది కాలంగా దేశ రాజ‌ధానిలో రైతులు ఉద్య‌మాలు చేస్తుంటే ఇదంతా త‌మ క్రెడిట్ అని ఎలా చెప్పుకుంటుంటారు అని నిల‌దీస్తోంది. అంతేకాదు ఏం చేశార‌ని రైతుల ఉద్య‌మం కోసం అని కూడా అడుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: