రాజకీయాల్లో గెలుపుకు నాయకులు ఇచ్చే హామీలు కీలకం అని చెప్పొచ్చు. ఈ హామీలే ఎన్నికల్లో గెలుపోటములని డిసైడ్ చేస్తాయి. నాయకులు హామీలు ఇవ్వడంతో పాటు....అవి అమలు చేస్తామనే నమ్మకం ఇవ్వాలి. అప్పుడే నాయకులకు ప్రజల మద్ధతు పెరుగుతుంది. 2014లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం హామీలే. ముఖ్యంగా రైతు రుణమాఫీ...డ్వాక్రా రుణమాఫీలు అని చెప్పొచ్చు. వీటితో పాటు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు.

కానీ ఈ హామీలు అమలు చేయడంలో బాబు విఫలమయ్యారు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు బాబుని కాదని జగన్‌కు పట్టం కట్టారు. ఇక గెలవడానికి జగన్ కూడా చాలా హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే జగన్ కూడా పలు హామీలని నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బాబు కంటే బెటర్ గానీ జగన్ హామీలు అమలు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం కాదనే చెప్పాలి. కొన్ని విషయాల్లో జగన్ మడమ తిప్పారనే చెప్పొచ్చు.

ఆ విషయం క్లియర్‌గానే కనబడుతోంది. అయితే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాల వల్ల...ప్రజలపై ఆర్ధిక భారం మరింత పెరిగింది. ప్రతి వస్తువుపై ధరల భారం పెరిగింది...అటు పన్నుల భారం పెరిగింది. అయితే చంద్రబాబు అధికారంలోకి రావాలంటే...జగన్ ప్రభుత్వం అమలు చేసే నిర్ణయాలని తాము అమలు చేయమని బాబు చెబితే చాలని, అప్పుడు టీడీపీకి అధికారంలోకి రావడానికి అవకాశాలు దొరుకుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉదాహరణకు ఇసుకని మళ్ళీ ఉచితంగా ఇస్తామని, మధ్యం ధరలని అదుపులో ఉంచి...మంచి బ్రాండ్లు తీసుకొస్తామని, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, ఇంటి పన్ను, ఆస్తి పన్నులు తగ్గింపు...ఇలా అనేక అంశాల్లో తగ్గింపు అనే హామీ ఇస్తే చాలు...జనం ఖచ్చితంగా టీడీపీ వైపు చూస్తారని అంటున్నారు. మరి ఎన్నికల సమయంలో ఎవరు ఎలాంటి హామీలు ఇచ్చి ప్రజలని ఆకర్షించి అధికారంలోకి వస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: