దేశంలో కరోనా కలకలం సృష్టిస్తున్న వేళ ఎట్టకేలకు ఎలాగోలా ప్రపంచ శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు టీకాను కనుగొని ఊరట కలిగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి శరవేగంగా విజృంభిస్తుండడం, వరదల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ఉండడంతో అందరూ వ్యాక్సినేషన్ వైపు అడుగులు వేశారు. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగడం అందుకు ప్రజలు కూడా సహకరించడం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కరోనా ఉదృతి తగ్గడంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది ఆసక్తి కనబరచలేదు, చాలా నిర్లక్ష్యం చేశారు. కొందరైతే మొదటి డోస్ వేసుకుని కూడా కరోనా తగ్గిపోయిందనే దైర్యంతో రెండవ డోసు వ్యాక్సిన్ ను తీసుకోలేదు.

ఇలాంటి వారు చాలామందే ఉన్నారు. అయితే ఇపుడు మళ్ళీ కరోనా భయం మొదలయ్యింది. పలు దేశాలలో ఓమిక్రాన్ విజృంభిస్తుండడం మన దేశం లోనూ ఈ వేరియంట్ ఎంట్రీ ఇవ్వడంతో ఇపుడు అందరిలోనూ మళ్ళీ ఆందోళన మొదలయ్యింది. ప్రస్తుతానికి ఈ వేరియంట్ వలన ఇబ్బంది లేదని ప్రముఖులు చెబుతున్నా ఎందుకో ముందు జాగ్రత్త అవసరం అని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోని వారు, మొదటి డోసు తీసుకుని సెకండ్ డోస్ తీసుకొని వారు ఎక్కువగా కంగారు పడుతున్నారు. అయితే మరో వైపు ఆ ఓమిక్రాన్ వేరియంట్ ని వ్యాక్సిన్ వలన శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటిబాడీస్ అడ్డుకోలేవని వార్తలు వినపడుతున్నప్పటికి వ్యాక్సిన్ ను వేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు కొందరు వైద్య నిపుణులు.

అలాగే మొదటి డోసు వేసుకున్న వారు సైతం ఒకసారి వైద్యులను కలిసి రెండవ డోస్ తీసుకోవడంపై వారి సలహా తీసుకుని తీసుకోవడం మంచిదని అంటున్నారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఓమిక్రాన్ ఇపుడు మన దేశంలోకి అడుగుపెట్టిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని సామాజిక దూరం, పరిశుభ్రత, మాస్క్ లు , సానిటైజర్ లు వంటి జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: