కానీ ఆ తరువాత వారం పది రోజులు గడవక ముందే మరొక సారి టమోటా ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఏపీలో టమోటాకు పుట్టినిల్లుగా భావించే చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ మరొకసారి సెంచరీ దాటేసినది. కిలో టమోట ధర రూ.102గా పలుకుతున్నది. ఇది కాస్త వినియోగదారుడికి చేరే సరికి మరింత పెరుగుతున్నది. దీంతో టమోటాను కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితికి ఏర్పడినది.
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాల ఎగుమతి జరుగుతున్నది. నాణ్యమైన టమాటా ఈ ఏడాది ఆరంభంలో కిలో రూ.6 నుంచి రూ.14 వరకు హోల్‌సేల్‌లో విక్రయాలు కొనసాగాయి. ఇక వర్షాలకు ముందు కిలో టమాటా రూ. 50కి పైగా పలికింది..
ఇక, ఏపీలో వర్షాల తరువాత టమాటా అమాంతం పెరిగిపోయి.. వంద దాటేసినది. మధ్యలో కాస్త తగ్గినట్టే అనిపించినా.. మరొకసారీ కిలో టమాటా నూరు రూపాయలకు పైగా పలుకుతున్నది. దీనికి ప్రధాన కారణం పంట దిగుబడి లేకపోవడమే అని పేర్కొంటున్నారు వ్యాపారులు. టమాటా మాత్రమే కాదు.. కూరగాయాలన్నింటి ధరలు పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్‌లో ఏ కూరగాయ తీసుకున్నా కిలో రూ.60-80కి పైగా పలుకుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి