తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో పెద్దగా దూకుడుగా లేకపోవడం కొన్ని విషయంలో వెనకడుగు వేయడం వంటివి కాస్త చంద్రబాబునాయుడికి బాగా ఇబ్బంది పెడుతోంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశాలు వస్తున్నా సరే చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యేల నుంచి అలాగే ఇన్చార్జి నుంచి సహకారం లేకపోవడం ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా నియోజకవర్గాల ఇన్చార్జిలు సమర్థవంతంగా నివారించ లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో భయపడటం అలాగే ఆర్థికంగా సమర్థవంతంగా ఉన్న నియోజకవర్గాల ఇన్చార్జిలు పార్టీ కోసం ఖర్చు చేయడానికి ముందుకు రాకపోవడం ఇబ్బందికరంగా మారిన అంశంగా చెప్పాలి.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరు సమర్థవంతంగా పని చేయకపోయినా సరే చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చాలా వరకు అధికార పార్టీలో ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కనీసం బయటకు రావడానికి కూడా చాలామంది నియోజకవర్గాల ఇన్చార్జిలు ఇబ్బందిగా వ్యవహరించడంతో చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా అనంతపురం జిల్లాలో అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చాలా మందిని మార్చే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.

ప్రధానంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చాలా మంది నాయకుల మీద సీరియస్ గా ఉన్నారని కుప్పం ఎన్నికలకు సంబంధించి చాలామంది నాయకులు ఆయనకు సహకరించకపోవడంతో వాళ్ళందరూ మీద కూడా చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమం చేశారు అని పార్టీ నుంచి ఎవరైనా సరే సస్పెండ్ చేయడానికి లేదా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను మరొకరికి అప్పగించడానికి ఆయన ఎక్కడా కూడా వెనకడుగు వేయటం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరి భవిష్యత్తులో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: