ఏపీలో అధికారం వైసీపీలో చాలా మంది నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ గత ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలను చేస్తామని హామీ ఇచ్చిన వారితో మొదలుపెడితే... మంత్రులను చేస్తామని హామీలు పొందిన వారు సైతం ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను జగన్ స్వయంగా ఎమ్మెల్సీ ఇచ్చి మరి... మంత్రిని చేసి తన క్యాబినెట్ లో పక్కన కూర్చోబెట్టుకుని అని చెప్పారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యి రెండున్నర సంవత్సరాలు అవుతుంది.

ఇప్పటివరకు మర్రి రాజశేఖర్ కు కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. ఇలాంటి నేతలు వైసీపీ లో ఎంతో మంది ఉన్నారు. వీరిని పక్కన పెడితే .. గ‌త‌ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ తర్వాత వైసీపీ కండువా కప్పి ఉన్న ఒక నేతకు పార్టీలో ఒకటి కాదు రెండు కాదు ... ఏకంగా మూడు పదవులు వచ్చాయి. వైసీపీలోనే ఆ నేతకు మించిన అదృష్టవంతుడు ఎవడు ఉంటాడు రా ? బాబు అని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.

ఆ నేత‌ ఎవరో కాదు ... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. గత ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తోట త్రిమూర్తులు ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ లోకి వచ్చిన వెంటనే జగన్ ఆయనకు అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంతోపాటు మండపేట వైసీపీ ఇన్చార్జ్ ప‌ద‌వి కట్టబెట్టారు.

ఈ రెండు పదవులు ఉండగానే ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. దీంతో తోట త్రిమూర్తులు ఇప్పుడు ఏకంగా మూడు పద‌వులు ద‌క్కించుకున్న‌ట్టు అయ్యింది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వారికే పదవులు లేవు. అలాంటిది గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా... ఇప్పుడు పార్టీలోకి వచ్చిన నేతకు మూడు పదవులు ఎలా? ఇస్తారు సొంత పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: