మామూలుగా మద్యం గురించి ఇతర రాష్ట్రాల్లో రాజకీయం జరగదు గానీ...ఏపీలో మాత్రం మద్యం చుట్టూనే రాజకీయం ఎక్కువగా నడుస్తోంది. అది కూడా జగన్ అధికారంలోకి వచ్చాకే దీనిపై ఎక్కువ రాజకీయం జరుగుతుంది. అసలు మద్యం చుట్టూ ఎందుకు రాజకీయం నడుస్తుందో అందరికీ తెలిసిందే. జగన్ అధికారంలోకి రాకముందు ఒకటే మాట చెప్పారు..అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యపాన నిషేధం చేసి..ఆడపడుచుల బాధలు తగ్గిస్తానని అన్నారు.

మరి అధికారంలోకి వచ్చాక అదే పనిచేస్తున్నారా? అంటే ఆ విషయం మహిళలనే అడిగితేనే బెటర్ అని చెప్పొచ్చు. జగన్ ఎంత బాగా మద్యపాన నిషేధం చేస్తున్నారో చెబుతారు. మద్యపాన నిషేధం ఎప్పుడో గాలిలో కలిసిపోయింది. పైగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే కొత్త బ్రాండ్లు అనాలో చెత్త బ్రాండ్లు అనాలో గానీ..డిఫరెంట్ బ్రాండ్లు ఏపీలోనే దొరుకుతున్నాయి. పైగా భారీ రేట్లతో. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆదాయం పెరుగుతూనే వస్తుంది. నాసిరకం మద్యం వల్ల జనం ఆరోగ్యం గుల్ల, జేబులు గుల్ల అవుతున్నాయి.

పైగా ఈ మద్యపాన నిషేధం అని చెప్పి...మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని షూరిటీగా పెట్టి అప్పులు చేశారు. అంటే ఈ మద్యపాన నిషేధం...నిషేధం అయినట్లే. అయితే సరిగ్గా గమనిస్తే ఈ మద్యం విషయంలో మరొక విషయం కూడా బయటపడుతుంది. ఇప్పుడు ప్రతిచోటా డిజిటల్ పేమెంట్లు పెరిగాయి. అలాంటప్పుడు ఏపీ వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు జరగడం లేదనేది మందుబాబుల డౌట్...ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటివి ఎందుకు లేవని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మనకెందుకు లేవని, పోనీ కార్డు స్వైపింగ్‌లు కూడా ఉండటం లేదనే అంటున్నారు.

ఇదే విషయాన్ని రఘురామకృష్ణంరాజు తాజాగా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఏపీ వైన్స్‌లో డిజిటల్ పేమెంట్లు లేకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని, ఏదో స్కామ్ జరుగుతుందని అంటున్నారు. మరి ఏపీ వైన్స్‌లో డిజిటల్ పేమెంట్లు లేకపోవడానికి కారణాలు ఏంటో ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap