వైద్యం పేరుతో సదరు వ్యక్తి ఇక బాధితురాలిని కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది సదరు మహిళ. బెంగళూరుకు చెందిన పార్వతి అనే మహిళ గత రెండు నెలల నుంచి తల నొప్పి సమస్యతో బాధపడుతోంది. ఎన్ని హాస్పిటల్లు తిరిగినా ఎలాంటి సమస్య లేదు అని వైద్యులు చెబుతున్నారు. తప్ప తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. దీంతో తల నొప్పి సమస్యకు కారణం గాలి సోకడం వల్లే అని అనుకుంది పార్వతి. తెలిసిన వాళ్ళ సలహాతో హాసన్ జిల్లా చెన్న రాయపట్నం సమీపంలో ఉన్న ఆలయ పూజారి మను గురించి విన్న మహిళ అతని దగ్గరికి వెళ్ళింది.
తల నొప్పి పూర్తిగా నయం చేస్తాను అంటూ పూజారి చెప్పాడు. ఇక వైద్యం చేస్తున్నాను అంటూ చేతిలో చెరుకుగడ పట్టుకొని మహిళను కొట్టాడు. ఇక ఈ నొప్పి తట్టుకుంటే తలనొప్పి పోతుంది అంటూ చెప్పాడు. శరీరం కాళ్లు తలపై కూడా చెరుకుగడతో చితకబాదాడు. కొన్ని దెబ్బలు కొట్టగానే ఆమె స్పృహ కోల్పోయి పడిపోయింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా చివరికి ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న పూజారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి